రంగారెడ్డి

దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జూన్ 27: నవాబులు, జమీందార్లు, దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తిగా చేతి వృత్తులు, కుల వృత్తులకు అండగా గౌడ్ కులస్థులు ఎదగాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మహేశ్వరం, కందుకూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను గౌడ్ కుల సంఘం నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ మొగలాయిలు, తానీషాల హయాంలో గీత వృత్తి, కుల వృత్తులపై ఆధారపడ్డ బలహీన వర్గాలపై దొరల అరాచకాలకు, ఆగడాలు, దాడులు సహించలేక ప్రజల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్నను గౌడ్ కులస్థులందరూ మహనీయునిగా గుర్తించాలని కోరారు. గౌడ కులవృత్తి ఆదర్శనీయమైందని, ప్రతి పల్లెలో నేటికి గౌడ కులస్తులు తలలో నాలుకలా వ్యవహరిస్తూ గౌరవం పొందుతున్నారని గుర్తు చేశారు.
పాపన్న వంశానికి చెందిన మనమంతా కేవలం ఒకే కులానికి పరిమితం కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ రాజకీయంగా ఎదగాలని, గౌడ కులస్థులందరు ఇక నుంచి తమ పేరుకు ముందు సర్దార్ అని పేరు చివర గౌడ్ అని రాసుకోవాలని తెలిపారు. తెలంగాణ గొప్ప సంప్రదాయం కలిగిన గౌడ్ బిడ్డలు అన్ని వర్గాల ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని సర్వాయి పాపన్న కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని పేర్కొన్నారు. లండన్ మ్యూజియంలో సర్వాయి పాపన్న విగ్రహం ఉందని, ఆంగ్లేయులే అతన్ని గొప్ప వీరునిగా గుర్తించారని వివరించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసిన మొదటి వ్యక్తి సర్వాయి పాపన్న అని కీర్తించారు. వీరుడిగా అతని చరిత్ర ఖ్యాతికెక్కిందని, దానిని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు చింతల మల్లేషం గౌడ్, వి.రామారావు గౌడ్, కిరణ్‌గౌడ్, బస్వ శంకరయ్య గౌడ్, మహేశ్వరం ఎంపిపి పి.స్నేహ, వైస్ ఎంపిపి యం.స్వప్న, జడ్పీటిసి ఈశ్వర నాయక్, మండల నాయకుల ఎన్.సుధీర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

భూతగాదాలే న్యాయవాది ప్రాణం తీసాయి

కీసర, జూన్ 27: రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంధ్రంలో ఆదివారం కారులో దహనమైన న్యాయవాది కేసును కీసర పోలీసులు ఛేదించారు. చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డిసిపి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఎఎస్‌రావునగర్‌లో నివాసముంటున్న ఆవుల తిరుమల ఉదయ్‌కుమార్ (48) వృత్తిరీత్యా న్యాయవాది. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మీలో పని చేయటంతో ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి జవహర్‌నగర్‌లోని చెన్నాపురంలో కేటాయించంది. ఆ భూమిని మేనల్లుడైన ఆంజనేయులుకి లీజుకు ఇచ్చాడు. నకులుడు భూమిని అమ్మే ప్రయత్నం చేస్తుండగా డొప్పలపూడి లోకేష్‌బాబు(22) ద్వారా భూమిని అగ్రిమెంట్ చేసుకొని రూ.25 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఇది తెలిసిన ఉదయ్‌కుమార్ తన కారులో శనివారం బయలుదేరి చెన్నాపురంలోని భూమి వద్ధకు చేరుకున్నాడు. భూమిని అమ్మేది లేదని లోకేష్‌కు తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటకు మాట పెరగడంతో లోకేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉదయ్‌కుమార్ మెడపై దాడి చేసి విచక్షణారహితంగా చంపి వేసాడు. ఉదయ్‌కుమార్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. పక్క పొలంలో ఉన్న సుమన్‌రెడ్డి (23) సహాయంతో ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని కారులో వేసుకున్నారు. లోకేష్ కారులో వస్తూ మార్గమధ్యలో ఐదు లీటర్ల పెట్రోలును కొనుగోలు చేసి పాలితిన్ బ్యాగులో కారులో వేసుకున్నాడు. శనివారం రాత్రి కీసర గ్రామ సమీపంలోని మల్లన్నగుడి వద్ద కారును చెట్లపొదల్లో ఉంచారు. అనంతరం తమ వెంట తీసుకు వచ్చిన పెట్రోల్ ఉదయ్‌కుమార్‌పై పోసి నిప్పు అంటించారు. ఈ క్రమంలో లోకేష్‌పై మంటలు చెలరేగి కడుపుభాగం కాలిపోయింది. వెంటనే షర్టును విప్పేసి మంటలను ఆర్పుకున్నాడు. ఉదయ్‌కుమార్ మృతదేహం పూర్తిగా కాలిపోయాక అక్కడి నుండి లోకేష్ వెళ్లిపోయారు. అనంతరం లోకేష్ చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేరాడు. మొదటి నిందితుడు లోకేష్‌ను గాంధీలో చికిత్స పూర్తి అయిన తర్వాత అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రెండవ నింతితుడు సుమన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సిఐ గురువారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్లు డిసిపి రామచంద్రారెడ్డి, ఏసిపి రఫీక్ తెలిపారు.