రంగారెడ్డి

ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఎంబిఏ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 29: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఎంబిఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట డివిజన్ సోమయ్యనగర్‌లో నివాసముండే కుమారస్వామికి ముగ్గురు పిల్లలు. ఇతని రెండో కుమారుడు మహేశ్ (22) శామీర్‌పేట్‌లోని విశ్వవిశ్వాని కళాశాలలో ఎంబిఎ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసిన మహేశ్ ఎక్కడ ఫెయిల్ అవుతాననే ఆందోళన నెలకొంది. బుధవారం గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

న్యాయవాదుల ఆందోళనలు ర్యాలీలతో అట్టుడికిన మేడ్చల్

మేడ్చల్, జూన్ 29: మేడ్చల్ 5వ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి రవీందర్‌శర్మ, జూనియర్ సివిల్ జడ్జి వేణును హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బుధవారం మేడ్చల్ న్యాయవాదులు ఆందోళనలు ర్యాలీలలు నినాదాలతో హోరెత్తించారు. మేడ్చల్ పట్టణంలో ఏటూ చూసినా న్యాయవాదులు ఆందోళనలు నిరసనలే కనిపించాయి. ముగ్గురు న్యాయవాదులు ఏకంగా అమరణ నిరాహరదీక్షకు దిగారు. మేడ్చల్ జడ్జిలు రవీందర్‌శర్మ, వేణు సస్పెన్షన్ విషయాన్ని తెలుసుకున్న న్యాయవాదులు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. కోర్టు నుండి బైక్ ర్యాలీ చేపట్టారు. మేడ్చల్ జాతీయ రహదారితో పాటు పలు పుర వీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి అక్కడి నుంచి తిరిగి కోర్టు వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి హైకోర్టు వెంటనే విభజించాలని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన జడ్జిలు వెంటనే వెనక్కు వెళ్లాలని జడ్జిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌లు పరిష్కారమయ్యేంత వరకు విధులకు హజరుకాబోమని ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, న్యాయవాదులు కృష్ణగౌడ్, సంతోష్, ప్రవీణ్‌కుమార్, రాఘవేందర్, వెంకటేశ్‌గౌడ్, నర్సింగ్‌రావు, శివకుమార్, శ్రీనివాస్‌గౌడ్, అఫ్సర్, తౌసిఫ్, ఎంఎ బారీ, అగ్నిహోత్రిరెడ్డి, వేణుయాదవ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అమరణ నిరాహరదీక్ష
బుధవారం సాయంత్రం మేడ్చల్ కోర్టు ఆవరణలో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు విజయగోపాల్, వెంకటేశ్‌గౌడ్, ధనుంజయ్ గౌడ్ అమరణ నిరాహరదీక్ష చేపట్టారు. బార్ అసోసియేషన్ తలుపులు మూసివేసి దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న న్యాయవాదులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకుని అమరణ నిరాహరదీక్ష చేపట్టిన న్యాయవాదులకు మద్దతుగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సిఐ రాజశేఖర్‌రెడ్డి తన సిబ్బందితో హుటహుటిన కోర్టు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆందోళనలు తీవ్రమైన దృష్ట్యా కోర్టు వద్ద భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.
న్యాయవాదుల పోరాటానికి జెఎసి సంపూర్ణ మద్దతు
ఉమ్మడి హైకోర్టును విభజించిన తర్వాతనే న్యాయాధికారులు సిబ్బంది కేటాయింపులు జరుపాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన పోరాటానికి జెఎసి సంపూర్ణ మద్ధతిస్తుందని జిల్లా జెఎసి తూర్పు విభాగం కన్వీనర్ నాగుర్ల సంజీవరావు తెలిపారు. బుధవారం మేడ్చల్‌లో మాట్లాడుతూ న్యాయమూర్తుల కేటాయింపుల్లో తెంలగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ న్యాయమూర్తులు, న్యాయవాదులు చేపట్టిన నిరసనలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఉమ్మడి హైకోర్టు విభజనను కావాలని తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా తెలంగాణ ప్రజలపై తమ పెత్తనం ఉండాలని ఆంధ్ర నాయకులు ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. హైకోర్టు విభజన సాధ్యం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మల మాట్లాడటం మంత్రికే చెల్లిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిపోయిన ఇంకా ఉమ్మడి హైకోర్టును విభజించకపోవడం దుర్మార్గమని, అలాంటపుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ప్రయోజనం ఏమటిని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులకు మద్దతు పలికిన న్యాయమూర్తులను హైకోర్టు సస్పెండ్ చేయడం రాజ్యంగ స్ఫూర్తికే విరుద్ధమని దుయ్యబట్టారు. ఏపి హైకోర్టుకు కావాల్సిన వసతులు కలిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని చెప్పినా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నోరు విప్పకపోవడం శోచనీయమని అన్నారు. గవర్నర్ చొరవ తీసుకోని కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని నివేదించాలని కోరారు. కేంద్రం కూడా బేషజాలకు పోకుండా హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన నిస్సహయతను పేర్కొంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సమస్య చేయిదాటిపోక ముందే హైకోర్టును విభజించే దాకా న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను రీకాల్ చేయాలని విఙ్ఞప్తి చేశారు. అటూ కేంద్రం ఇటూ సుప్రీంకోర్టు ఇరువురు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. న్యాయమూర్తుల సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని సంజీవరావు డిమాండ్ చేశారు.

అనుబంధ సంఘాలతో కాంగ్రెస్ బలోపేతం

మల్లు భట్టివిక్రమార్క
చేవెళ్ల, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టత కోసం ఆ పార్టీ అనుబంధ సంఘాలు బలోపేతం కావాలని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీరు అందించేందుకు రూ.36వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, అందులో 10వేల కోట్లతో పనులను కూడా మొదలు పెట్టారని, కాని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం కేసిఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని 83వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాకు సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలమవుతుందని, ప్రాజెక్టు డిజైన్‌ను మారిస్తే జిల్లాఎడారిగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఆయన మండిపడ్డారు. రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలకు వేస్తున్నామని తెలిపారు. దీనికోసం 30 రోజుల ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. మొదటి 10 రోజుల్లో జిల్లాస్థాయి కమిటీల నియామకం, మరో 10రోజులలో మండల స్థాయి కమిటీల నియామకం, తర్వాత 10రోజులలో గ్రామస్థాయి కమిటీలను నియమిస్తామని తెలిపారు. ఒక్కో కమిటీలో 10 మందికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి మండలానికి 3వేల మంది నాయకులతో, నియోజకవర్గంలో 15వేల మంది కార్యకర్తలు తయారవుతారని తెలిపారు. కమిటీలన్నీ నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తెలిపేలా గ్రామ శాఖలు పనిచేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.సబితారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్లలో నిరంకుశ పాలన కొనసాగించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. నేడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలపై చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, పిసిసి ప్రధాన కార్యదర్శి కుసుంకుమార్, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పి.కార్తీక్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరెపల్లి మోహన్, డిసిసి మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్గారి రమణా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పైండ్ల గోపాల్ రెడ్డి, నాయకులు దేవర శ్రీ్ధర్ రెడ్డి, వనం మహేందర్ రెడ్డి, వెంకటేషం గుప్త, పట్లోళ్ళ క్రిష్ణా రెడ్డి, వీరేందర్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పైండ్ల మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షుడు టేకులపల్లి శ్రీనివాస్, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం

జీడిమెట్ల, జూన్ 29: అక్రమ కెమికల్ గోదాముల్లో అగ్ని ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వరుస అగ్ని ప్రమాదాలతో జీడిమెట్ల పారిశ్రామిక వాడ బెంబేలెత్తిపోతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితుల్లో జీడిమెట్ల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. నెల రోజుల్లో నాలుగైదు అగ్ని ప్రమాదాలు కేవలం అక్రమంగా కొనసాగుతున్న కెమికల్ గోదాముల్లోనే జరుగుతుండడం విశేషం. వరుసగా అక్రమ కెమికల్ గోదాముల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటే అసలు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విధుల్లో ఉన్నారా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. బుధవారం తెల్లవారుఝామున జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సుభాష్‌నగర్, గంపలబస్తీలో అపోలో ట్రేడర్స్ కెమికల్ గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. సుమారు 240 కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండడంతో బాంబుల్లా పేలాయి.
కెమికల్ డ్రమ్ముల నుంచి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఐదు ఫైరింజన్‌లతో సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్‌తో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాము యజమాని ఆనంద్ జైన్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని సేకరించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వరుస అగ్ని ప్రమాదాలు
జీడిమెట్ల పారిశ్రామికవాడలో నెలరోజుల్లోనే మూడు నుండి నాలుగు వరకు వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా నడిపే కెమికల్ గోదాములలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పిసిబి విభాగంలో చలనం రావడం లేదు. ఇటీవల దూలపల్లి శివారులో రెండు కెమికల్ గోదాముల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా గంపలబస్తీలో కెమికల్ గోదాములోనే అగ్ని ప్రమాదం సంభవించడం విశేషం. వరుసగా అక్రమ కెమికల్ గోదాముల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా కొనసాగుతున్న కెమికల్ గోదాములపై కఠిన చర్యలు తీసుకుని మరోసారి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
కూకట్‌పల్లిలో మరో చోరీ

కెపిహెచ్‌బికాలనీ, జూన్ 29: కూకట్‌పల్లిలో అంతరాష్ట్ర ముఠాకు చెందిన దొంగల జోరు కొనసాగుతోంది. ఇటీవలి ప్రగతినగర్ చోరీలో లక్షలాది రూపాయల నగదు, బంగారం అపహరణ, కెపిహెచ్‌బికాలనీలో 8 ఇళ్లలో దొంగతనం సంఘటనల్లో కాకుండా మొన్న కెపిహెచ్‌బికాలనీలోని సైబరాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో, తాజాగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగి ఇంట్లో.. అంతరాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. మంగళవారం కెపిహెచ్‌బికాలనీలో జరిగిన దొంగతనంలో సచివాలయ ఉద్యోగి ఇంట్లో రూ.3లక్షలు చోరీకి గురయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెపిహెచ్‌బికాలనీలోని ఎమ్‌ఐజి-552లో నివాసముంటున్న వెంకటేశ్వర్‌రావు సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీలో ఉంటున్నాడు. కుమారుడి ఫీజు కోసమని రూ.3లక్షలను బ్యాంక్‌లో లోన్‌కు దరఖాస్తు చేయగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచిపెట్టాడు. కాగా ఇంటికి తాళం వేసి ఊరేళ్లగా మంగళవారం మధ్యాహ్నం దొంగలు ఇంటి ప్రధాన ద్వారం గడియ తొలగించి ఇంట్లో బీరువాలో దాచుకున్న రూ.3 లక్షల నగదును అపహరించుకొని పరారయ్యారు. కుమారుడు ఉన్నత చదువుల నిమిత్తం బ్యాంక్ ద్వారా తీసుకున్న డబ్బులు చోరీ కావడంతో వెంకటేశ్వర్‌రావు దంపతులు బోరున విలపించారు.
కాగా మంగళవారం జరిగిన చోరీ ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించడానికి రావాల్సిన క్లూస్ టీం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాకపోవడంతో బాధితుడు వెంకటేశ్వర్‌రావు కెపిహెచ్‌బి పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మంగళవారం జరిగిన ఘటనపై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని అవసరమైతే వీరిపై హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపు

ఇబ్రహీంపట్నం, జూన్ 29: రాష్ట్రంలో తెరాస కుటుంబ పాలన కొనసాగిస్తుందని, దానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక వైస్ ఎంపిపి కొత్త అశోక్‌గౌడ్.. భాజపాలో చేరుతున్న సందర్భంగా మండల కేంద్రంలోని శాస్తా గార్డెన్స్‌లో బహిరంగసభను నిర్వహించారు. సభకు హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నీయంత పాలన కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కాంట్రాక్టర్లను బ్రతికించేందుకేనని, వాటితో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. కాంట్రాక్టులిచ్చి వారి నుండి కమీషన్లు కొడుతూ ప్రభుత్వ పెద్దలు కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పేద దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వంటి అన్ని హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 90వేల కోట్ల రూపాయలు అందించిందని, వాటిని ఖర్చు చేసిన విధానాన్ని సైతం ప్రజలకు తెలియకుండా వాస్తవాలను దాచిపెడుతోందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం గత యుపిఎ ప్రభుత్వంతో పోరాడిన ఘనత భాజపాకే దక్కిందని అన్నారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరికి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టింపజేసి దానిని ఆమోదింపజేసిన ఘనత భాజపాదేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వ్యవహరించిన విధంగానే, రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ భాజపా కీలక భూమిక పోషిస్తుందని వెల్లడించారు. రెండేళ్ల ఎన్డీఎ పాలనలో అవినీతికి తావివ్వకుండా పాలన కొనసాగిస్తోందని చెప్పారు. రైతు, కార్మిక, కర్షక, యువత కోసం అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తోందని పేర్కొన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి భాజపాను మరింత బలోపేతం చేయాల్సిన భాద్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని చెప్పారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి కేంద్రంలో మాదిరిగానే రానున్న 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. వైస్ ఎంపిపి కొత్త అశోక్‌గౌడ్ పార్టీలో చేరడం ఈ ప్రాంతంలో పార్టీకి కలిసొచ్చే అంశమని, ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని తెలిపారు. భారీ సంఖ్యలో భాజపా కార్యకర్తలు చెరువుకట్టపై నుండి శాస్తా గార్డెన్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుని రాకతో ఇబ్రహీంపట్నంలో భారీ కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
భాజపాలో భారీ చేరికలు
భాజపాలో ఇతర పార్టీలకు చెందిన నేతలు భారీగా చేరారు. ఇబ్రహీంపట్నం వైస్ ఎంపిపి కొత్త అశోక్‌గౌడ్ తన అనుచరులతో పాటు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు భాజపా ఖండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై.లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, దళితమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోసుపల్లి ప్రతాప్, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆచారి, రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, కొంపల్లి మోహన్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల భాస్కర్, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, సీనియర్ నాయకులు నాయిని సత్యనారాయణ, మీడియా సెల్ కన్వీనర్ టేకుల రాంరెడ్డి, జి లచ్చిరెడ్డి, కొప్పు బాష, మొగిలి గణేష్, పోరెడ్డి సుమతి, దొండ రమణారెడ్డి, జక్క రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

చినుకు పడితే చిత్తడే
వికారాబాద్, జూన్ 29: వికారాబాద్ పట్టణంలో కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ నీటిమయం అవుతున్నాయి. అంతర్గత రోడ్లే కాకుండా ఏ ప్రధాన రోడ్డుకు వెళ్ళినా నీరు నిలిచిఉండటం, గుంతలమయం అవడం, రోడ్డు పక్కన బురదమయం అవుతోంది. ఇక్కడి ప్రాంతం ఎర్రమట్టి నేలకావడంతో కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చిత్తడి అవుతున్నాయి. మంచి బట్టలు వేసుకుని బయటకు వెళ్లి వస్తే మరకలు తప్పనిసరి. అంతేకాకుండా వాహనదారులు రోడ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన వర్షం నిలిచే స్థాయిలో గుంతలు ఏర్పడటంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక పాదచారులు అవస్థలు పడుతున్నారు. ఇక పట్టణంలో శాటిలైట్ టౌన్‌షిప్ పథకం కింద చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, మంజీరా నీటిపైపులైనుకోసం తవ్విన అంతర్గత రోడ్లు పూర్తిస్థాయిలో మరలా వేయకపోవడంతో అక్కడ నివసించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా భూగర్భ డ్రైనేజీ నుండి మురికినీరు పొంగిపొర్లడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మున్సిపల్, అర్‌అండ్‌బి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.
వర్షాకాలం రాకముందే పట్టణంలో పర్యటించి ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సి ఉండగా, సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కరించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి యుద్దప్రాతిపదికన సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే పట్టణ శివారు కాలనీలు, గ్రామాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల దయనీయ పరిస్థితి ఊహించవచ్చు.

ఫీజులు తగ్గించమన్నందుకు 22 మందికి టీసీలు

అల్వాల్, జూన్ 29: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో ఉన్న మాతా అమృతామయి పాఠశాలలో పేదలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాలని కోరిన 22మంది విద్యార్థుకు పాఠశాల నుండి టీసీలు పోస్టులో పంపి వారి అడ్మిషన్ రద్దు చేసిన అంశం వివాదంగా మారింది. రెండువారాలుగా జరుగుతున్న వివాదానికి ప్రజాసంఘాలు మద్దతు పలుకుతున్నాయి.