రంగారెడ్డి

ఫిర్యాదులు రాకుండా గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 5: మండలంలో చేపడుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఫిర్యాదులు రాకుండా చేపట్టాలని వికారాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలు ఎస్.్భగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఉపాధి హమీ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పదో రౌండు ఉపాధి హామీపనుల సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆమె మాట్లాడుతూ రైతు కూలీలకు అన్యాయం జరగకుండా ఉపాధి హమీ పనులు సాగాలని సూచించారు. గత ఏడాది హరితహారంలో నాటాల్సిన మొక్కలు ఎండిపోయాయని అది పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. వంద రోజులు పని కల్పించాల్సి ఉండగా తక్కువరోజులు పని కల్పిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారని, ఎన్ని రోజులు పని కల్పించారో కూలీలకు స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. కూలీలకు మేలు జరిగేలా పనులు చేపట్టాలని అన్నారు. ఉపాధి హమీ పథకం సామాజిక తనిఖీ గ్రామసభ విషయమై సర్పంచ్, ఎంపిటిసిలకు తప్పక సమాచారం ఇవ్వాలని తెలిపారు. సభలో ఎంతమేర ఉపాధి హామీ పనులు జరిగాయో వివరించాలని చెప్పారు. ఎక్కడ ఉపాధి హామీ పనులు చూసినా అవకతవకలు బయటపడతాయని, సిబ్బంది తమ వంతు బాధ్యతగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
జడ్పీటిసి ముత్తహర్‌షరీఫ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో నాణ్యమైన పనులు చేపట్టకపోవడంతో దుర్వినియోగమవుతోందని, శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని విమర్శించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చేపట్టాల్సిన పనులను గంటలో ముగించి చేతులు దులుపుకుటుంన్నారని ఆరోపించారు. కూలీలు ఉపాధి పొందుతున్నారు తప్ప అందులో నాణ్యత కనిపించడం లేదని చెప్పారు. పథకంలో అవకతవకలను గుర్తించి చర్చించడానికే సామాజిక తనిఖీ అని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులపై దృష్టిపెట్టాలని సూచించారు. మొక్కుబడిగా పనులు చేపడితే కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయినట్టేనని, వాస్తవాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినపుడే చర్యలు తీసుకుంటారని వివరించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ పథకం ప్రారంభమై 10 సంవత్సరాలైనా ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.
వలసలు అరికట్టేందుకు పథకం ప్రారంభించారని, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వీడాలని సూచించారు. గిరిగెట్‌పల్లి గ్రామంలో పొలాలకువెళ్ళే రోడ్డు పని చేపట్టాలని పలుమార్లు చెప్పినా లాభం లేకపోయిందని అన్నారు. క్షేత్ర స్థాయిలో కచ్చితమైన చర్యలు తీసుకుంటేనే పథకం సజావుగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎంపిడివో ఎం.సత్తయ్య, ప్రిసైడింగ్ అధికారి జాన్సన్, ఏపిడి అప్పారావు, ఎపివో సురేష్ పాల్గొన్నారు.