రంగారెడ్డి

పోలీసులంటే భరోసా కలిగేలా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 20: పోలీసులు అంటే భరోసా కలిగే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేయాలని జిల్లా ఎస్పీ ఎం నారాయణ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఆయా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం ఎవరు చేసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు మాట్లాడి వారి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.