రంగారెడ్డి

ఐచ్ఛికాల ఎంపికలో విద్యార్థులకు ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, మే 22: మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలల ఎంపిక కోసం ఇచ్చిన ఐచ్చికాల వెబ్ ఆప్షన్ పనిచేయక అనేక మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 3వ తేదీ నుంచి దరఖాస్తులు మొదలెట్టి ఏప్రిల్ 4 వరకు స్వీకరించారు. గత 21న అన్ని కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఈనెలలో ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు సాధించిన వారు ఈనెల 22వతేదీ లోపు కళాశాలల ఎంపికకు ఐచ్చికాలు ఆన్‌లైన్ ద్వారా ఇచ్చుకోవాలని సూచించారు. కానీ, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ మాత్రం మొరాయించింది. ఎంతకూ తాము ఐచ్చికాలు ఇచ్చుకుందామని ప్రయత్నించినా రావడం లేదని పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయమై వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే కూడా సరైన స్పందన లేదని ఆరోపించారు. ప్రధాన కార్యాలయం ఫోన్‌కు ఒక్కో విద్యార్థి సుమారుగా వంద సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని తెలిపారు. సర్వర్ మొరాయించడంతో పాలుపోని విద్యార్థులు ఉసూరుమంటు ఇంటిముఖాలు పట్టారు. ఒక్కో విద్యార్థికి సాలీన 80 మార్కుల వరకు వచ్చిన వారు కూడా సర్వర్ మొరాయించడంతో చేసేది లేక ఐచ్చికాలు ఇచ్చుకోలేకపోయారు.
ఐచ్చికాలు ఇచ్చుకునేందుకు రెండు మూడు రోజుల నుంచి అంతర్జాల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా సర్వర్ పనిచేయక ఇంటి దారి పట్టామని పలువురు విద్యార్థులు వాపోయారు. అధికారులు స్పందించి తమకు కళాశాలల ఐచ్చికాలు ఇచ్చే గడువును పెంచాలని కోరుతున్నారు.
పేద కుటుంబానికి ఆర్థిక సహాయం
షాద్‌నగర్ టౌన్, మే 22: గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాల గ్రామానికి చెందిన గుట్టెనికి నర్సింలు గత కొనే్నళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ, మంగళవారం రాత్రి మృతి చెందాడు. దాంతో మృతుని కుటుంబ సభ్యులకు సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గ్రామ యువకులు ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మృతుడి భార్య ఐదేళ్ల క్రితమే చనిపోగా, నర్సింహా పక్షవాతంతో చనిపోయాడని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో ఎండి.మోయినోద్దీన్, వెంకటయ్య, శ్రీహరి, రాములు, జంగయ్య, కుర్మయ్య, కే.వెంకటయ్య పాల్గొన్నారు.
27న కాచవానిసింగారంలో
ఏవీస్ క్రికెట్ టోర్నమెంట్
ఉప్పల్, మే 22: కాచవానిసింగారం గ్రామంలోని బాబూరావు క్రికెట్ అకాడమీ ఆవరణలో ఈ నెల 27న క్రికెట్ ఏవీస్ క్రికెట్ టోర్నమెంట్ 2019ను నిర్వహించనున్నారు. ఏవీ కన్‌స్ట్రక్షన్స్ వారి సహకారంతో తెలంగాణ టీఆర్‌ఎస్ యూత్ విభాగం పీర్జాదిగూడ పురపాలక సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నమెంట్ బ్రోచర్‌ను బుధవారం మంత్రి మల్లా రెడ్డి, ఏవీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ జెక్కా వెంకట్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని క్రికెట్ టీమ్‌లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఆసక్తి కల వారు ఈ నెల 24వ తేదీ ఉదయం 10గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని, అదే రోజు సాయంత్రం డ్రా ఉంటుందని టీఆర్‌ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు బత్తుల కిరణ్‌గౌడ్, నేత పైల్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. క్యాష్ ప్రైజ్ విన్నర్‌కు రూ.25వేలు, రన్నర్‌కు రూ.11వేలు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9100145676, 8919075947, 8341164765 సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పరుశరాం, తరుణ్, రంజిత్, కార్తీక్, మణిదీప్ పాల్గొన్నారు.