రంగారెడ్డి

వైభవంగా బీరప్ప స్వామి నాగవెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 22: ఉప్పల్ బీరప్పగడ్డలోని బీరప్ప ఆలయంలో బీరప్ప-కామరాతి దేవి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ బీరప్ప స్వామి, కామరాతి దేవి, మహంకాళీ, బోగన్న వేశాలతో ఒగ్గు కళాకారులు నిర్వహించిన నాగవెల్లి భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా జరిగింది. అక్క మహంకాళీ వేషం చౌదరిపల్లి చుక్క కుమార స్వామి, బీరప్ప వేషం కవిడే అశోక్, కామరాతి దేవి వేషం బీర్ల జంగయ్య, బోగన్న వేషం గుల్లని మధు, సహాయకులు నంద నరేష్, చిందం శ్రీనివాస్ వేషధారణతో చెప్పిన బీరప్ప కథ వేలాది మంది మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. కామరాతికి పనులు చేయడం రాదని బీరప్ప స్వామి ఏడ్చినపుడు ప్రేక్షకులు కంటతడి పెట్టారు. మహంకాళీ అమ్మ వారు కామరాతికి పనులు నేర్పించారు. కురుమలు ఇంటి నుంచి తెచ్చిన పెరుగును మహంకాళీ తల్లి కామరాతికి సల్ల చేయుట నేర్పించారు. తయారైన సల్ల (మజ్జిగ) కురుమలందరికి పంపిణీ చేయగా కురుమలందరి ఇండ్లకు వెళ్లి ఒడి బియ్యం పోసుకుని అందరిని ఆశీర్వదించారు. పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఒగ్గు కథను ఆలకించారు. అంతకు ముందు కురుమ సంఘం ఉప్పల్ కమిటీ ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ న్యాయవాది గొరిగె మల్లేశ్ కురుమ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గొరిగె ఐలయ్య, చిందం వెంకటేశ్, శాగ పెంటయ్య, గొరిగె జగన్, కర్రె శ్రీనివాస్, లింగస్వామి, బండారి మంజుల, బండ మహేష్, బట్కిరి బీరప్ప, సత్యనారాయణ, బర్ల కృష్ణ, కర్రె రాములు, శేఖర్, గొరిగె సతీష్ పాల్గొన్నారు.
ఘనంగా సంకష్టహర చతుర్థి
షాద్‌నగర్ టౌన్, మే 22: సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని సాయిమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శివమారుతి గీతాఅయ్యప్ప మందిరంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకష్టహర చతుర్థి ప్రతి మాసం కృష్ణ పక్షంలో నాలుగో రోజు వచ్చే చవితి అని, ఈరోజు గణపతికి పూజలు చేసినవారికి ఎలాంటి కష్టాలు రావని భక్తుల నమ్మకం. కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ప్రేమ్‌సాయి కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గందె సురేష్, గడ్డం ఆంజనేయులు, ఎంసాని శ్రీనివాస్, పెద్ది రామ్మోహన్, నీల రవీందర్, యూత్ సభ్యులు ఈగ వెంకట్ రాంరెడ్డి, ఆర్.కైలాస్‌నాథ్, సత్యం, ప్రవీణ్, నరేష్, సిద్దు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అభిలాష్, సందీప్ పాల్గొన్నారు.