రంగారెడ్డి

అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 22: మేడ్చల్‌లో మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు ఊరుములు మెరుపులతో కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసినా రోడ్లపై భారీ చెట్లు నేలకొరిగిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగి.. తీగలు తెగిపోయాయి. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, గౌడవెళ్లి, పూడూరు తదితర గ్రామాల్లో భారీ చెట్లు విరిగి పడ్డాయి. చెట్లు విద్యుత్ తీగలపై పడిపోవడంతో స్తంభాలు, తీగలు తెగిపోయి, మేడ్చల్ మొత్తం అంధకారమయంగా మారిపోయింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా తిరిగి అర్థరాత్రి ఒంటి గంట తర్వాత పునఃప్రారంభమైంది. విద్యుత్ అధికారులు సిబ్బంది ఎంతో కష్టపడి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చెట్లను నరికి తెగిన విద్యుత్ తీగలను సరిచేసి ఎంతో శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మంగళవారం రాత్రి అంధకారంలో విద్యుత్ లేక మేడ్చల్ ప్రజలు జాగారం చేశారు. కరెంట్ లేకపోవడంతో ఇళ్లలో ఉక్కపోతను తట్టుకోలేక తీవ్ర అవస్థలకు గురయ్యారు. బుధవారం కూడా అడపదడపా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొత్తం సరఫరాను సరిదిద్దే వరకు విద్యుత్ అధికారులకు తలప్రాణం తోకకువచ్చింది. ఎట్టకేలకు లోటుపాట్లను సరిచేసి విద్యుత్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కృషి చేసినటువంటి అధికారులను సిబ్బందిని పలువురు మెచ్చుకున్నారు. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు రోడ్లపై పడిపోయిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. మేడ్చల్ పట్టణంలోని పలు కాలనీల్లో చెట్లు ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన కార్లపై పడిపోవడంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులకు 44వ జాతీయ రహదారి వెంబడి కూడా పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద రోడ్డు పక్కన ఉన్న ఓ భారీ చెట్టు విద్యుత్ తీగలపై పడిపోయింది. పూడూరు, గౌడవెళ్లి, గుండ్లపోచంపల్లి గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. గత పది రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు, మంగళవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షంతో కాస్త ఉపశమనం పోందారు.
ఇంటిపై కూలిన చెట్టు
షాద్‌నగర్ : భారీ వర్షం ప్రతాపాన్ని చూపుతోంది. మంగళవారం షాద్‌నగర్‌లో కురిసిన వర్షానికే చాలా నష్టం సంభవించింది. బుధవారం కొందుర్గు మండలంలో భారీగా ఈదురుగాలులకు లాల్‌పహడ్ వద్ద ఇంటిపై చెట్టు కూలి పడింది. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈదురుగాలులకు అక్కడక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కేశంపేట మండలంలో ముసురు వర్షం కురిసింది. షాద్‌నగర్‌లో మేఘావృతమై ఉంది. ఎపుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి.