రంగారెడ్డి

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మే 22: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ కీసర సమీపంలోని హోలీమేరీ కళాశాలలో నిర్వహిస్తున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. బుధవారం కీసరలోని కేబీఆర్ గార్డెన్‌లో పోలీస్ అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. కౌంటింగ్ సెంటర్లలోకి పాస్‌లు ఉన్న వారినే అనుమతించాలని తెలిపారు. వాహనాల తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించాలని అన్నారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశామని, భద్రతా బలగాలు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, కేంద్ర బలగాల నిఘా నీడలో కౌంటింగ్ నిర్వహిస్తామని వివరించారు. గురువారం ఎలాంటి సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని స్పష్టం చేసారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం ఆరు గంటల లోపు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టె, లైటర్ వంటి నిషేధిత వస్తువులు లోపలికి తీసుకు రాకూడదని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుల సూచనలు, సలహాలు పాటించి ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ముందుగా హోలీమేరీ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. కార్యక్రమంలో డీసీపీలు ఉమామహేశ్వర శర్మ, రాంచంద్రారెడ్డి, ఏసీపీ శివకుమార్ పాల్గొన్నారు.

ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు సత్యదూరం
కేపీహెచ్‌బీకాలనీ , మే 22 : గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చేసిన ఆరోపణలు అవాస్తవమని స్వేరొస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బోట్ల భిక్షపతి అన్నారు. ఆరోపణలు, స్వేరోస్, ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థి నాయకులపై జరిపిన దాడులకు నిరసనగా బుధవారం జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డ్సుతో నిరసన తెలిపారు. భిక్షపతి మాట్లాడుతూ దళిత గిరిజన విద్యాభివృద్ధి ఓర్వలేకనే పలు విద్రోహ శక్తులు ఏకమై ఆసత్య ప్రచారాలకు పునుకుంటున్నారని అన్నారు. నాణ్యత కలిగిన విద్యను అందించడానికి గ్రంథాలయాలు, స్టడీ సర్కిల్, విద్యను ప్రోత్సహించడం, వైద్య శిబిరాలు, యువతకు ఉపాధి, నిరుపేదలకు ఇల్లు కట్టించడం, ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాజు, వెంకి యంగ్ ఇండియా రన్ ఫర్ ఇండియా ఫౌండర్ రేవంత్ నాయక్, రమేష్ రాథోడ్, రాజు నాయక్, చరణ్, ప్రశాంత్, ఆజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.