రంగారెడ్డి

బిసి రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జులై 6: దేశంలో 60 శాతం జనాభా ఉన్న బిసిలకు జనాభా ప్రాతిపథికన రిజర్వేషన్ కల్పించే విధంగా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక డాగ్ బంగ్లా అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభలలో బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశంలో 60 శాతం మేరా ఉన్న బిసిలకు 18 శాతం కూడా రిజర్వేషన్లు లేకపోవడం దారుణం అన్నారు. వెంటనే బిసిలకు న్యాయం చేసే దిశగా పార్లమెంటులో బిసి రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిసి బిల్లును ప్రవేశ పెట్టేందుకు గానూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అఖిలపక్షంతో డిల్లీకి వెళ్ళాలన్నారు. జనాభా దామాషా ప్రకారం ప్రాతినిథ్యం కల్పించని పార్టీలకు రాజకీయ సమాది కడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిసి ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కుంట్లూరు వెంకటేష్‌గౌడ్, నాయకులు సుర్వి దుర్గయ్య, శ్రీనివాస్, అజయ్, విజయ్, కృష్ణ, మల్లేష్, వెంకటేష్, రాజుగౌడ్, శ్రీశైలం, మహేంధర్‌గౌడ్ పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో పనులను
పరిశీలించాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 6: వానాకాలం కష్టాలను తగ్గించేందుకు జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు, అత్యవసర బృందాలు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇంజనీర్లు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి ఆదేశించార. ముఖ్యంగా తరుచూ వర్షాలు కురుస్తున్నందున నగరంలో ఎక్కడైనా రోడ్లపై ఏర్పడే గుంతలు, భారీగా వర్షపు నీరు నిల్వటం వంటి సమస్యలకు సంబంధించి అనేక ఫిర్యాదులొస్తుంటాయని, వాటిని ఎప్పటికపుడు అటెండ్ చేస్తూ, క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న తీరుపై కూడా దృష్టి సారించాలన్నారు. భారీగా వర్షాలు కురిసినపుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ఎమర్జెన్సీ బృందాలు స్పందించి అప్పటికపుడే క్షేత్ర స్థాయి విధులకు హజరుకావాలన్నారు. ఇలాంటి పనులకు సంబంధించి అధికారులు కాంట్రాక్టర్, వర్క్ ఇన్‌స్పెక్టర్, కార్మకులతో కలిసి చర్చలు జరిపితే, క్షేత్ర స్థాయిలో జరిగే పనులు ఎంతో చక్కగా జరుగుతాయన్నారు. ఈ పనులు మంజూరు చేసే అధికారి మొదలుకుని, పనులను క్షేత్ర స్థాయిలో చేసే సిబ్బంది అంతా కూడా సమన్వయంతో వ్యవహారించాలన్నారు. ప్రతి పని వద్ధ పని వివరాలు, పని అంచనా వ్యయం, ఎపుడు ప్రారంభించారు, ఎపుడు పూర్తవుతుందోనన్న సమాచారంతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మళ్లీ ఈ నెల 12వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న ఈ సమీక్షా సమావేశంలో పనుల పరోగతికి సంబంధించి, పనులు సక్రమంగా, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా త్వరితగతిన నిర్వహించేందుకు కార్యచరణను సిద్దం చేసి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సురేంద్రమోహన్, ఇంజనీర్లు పాల్గొన్నారు.
బోనాల జాతరకు ‘గోల్కొండ’ ముస్తాబు
నార్సింగి, జూలై 6: బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును చేసింది. బోనాల ఉత్సవాలు నగరంలో నేటి నుంచి ముందుగా లంగర్‌హౌస్‌లోని అమ్మవారికి భారీ తొట్టెల ఊరేగింపుతో ప్రారంభమై సాయంత్రం వరకు గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహాంకాళీ అమ్మవారికి సమర్పిస్తారు. చారిత్రాత్మకమైన గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహాంకాళీ (ఎల్లమ్మ తల్లి) అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ పురస్కారించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కమిటీ చైర్మన్ కోయిల్‌కర్ గోవింద్‌రాజ్ తెలిపారు. ఈ జాతర గురువారం మధ్యాహ్నం 12గంటలకు మొదటి పూజ ప్రారంభమవుతుంది. ఉత్సవంతో నగరంలో నెల రోజుల పాటు బోనాల జాతర సందడి నెలకొంటుంది. తెలంగాణ సంస్కృతిలో ప్రధాన మైన పండుగ బోనాల పండుగ ఒకటి. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, అయురారోగ్యాలతో ఉండడానికి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే బోనాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ బోనాల జాతర మరింత ప్రసిద్ధి చెందింది. పండుగను నిజాం కాలంలో కూడా నవాబులు ఎంతో ఆదరించి ఘనంగా నిర్వహించుకునేందుకు వెన్నుదన్నుగా నిలిచేవారు.
మొదటి పూజకు మంత్రులు హాజరు
చారిత్రత్మకమైన గోల్కొండ కోటపైన ఉన్న శ్రీజగదాంభిక మహాంకాళీ (ఎల్లమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో గురువారం మధ్యాహ్నం మొదటి పూజలను నిర్వహిస్తారు. మొదటి పూజకు మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావుతో పాటు తలసాని, టిఆర్‌ఎస్ నాయకులు, భారీగా భక్తులు బోనాల ఉత్సవాలలో పాల్గొంటారు.
870 ఏళ్ల చరిత్ర
క్రీ.శ. 1083 నుంచి 1323 వరకు ఆనాటి గోల్లకొండ ప్రాంతం కాకతీయల పాలనలో ఉండేది. ప్రతి రోజు మాదిరిగానే ఒక రోజు కొండపై గోర్రెలు మేపుతున్న కాపరికి అమ్మవారి విగ్రహం కనిపించింది. విషయాన్ని అప్పటి కాకతీయ రాజులకు తెలుపడంతో రాణి రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు మట్టితో దేవాలయాన్ని నిర్మించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. కొండపై గొర్ల మేపుతున్న కాపరులతో గొల్లకొండ అని నామకరణం వచ్చిందని నానుడి. గోల్కొండ కోటకు గొల్లకొండ అని పేరు ఉండేది. కాలక్రమంలో గొల్లకొండకు ముస్లిం రాజులు గోల్కొండ అని పేరు నామకరణం చేశారు. 570 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. కొండపై ఉన్న అమ్మవారికి నాటి నుంచి నేటి వరకు బోనాల ఉత్సవాలను ప్రజలు నిర్వహిస్తున్నారు.
నాటి నుంచి నేటి వరకు
అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహాంకాళీ అమ్మ వారి ఆలయంలో తొలిపూజ రోజన నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి పూజ రోజున ప్రతి సారి దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహాంకాళి అమ్మవారికి భారీ తొట్టెలను మొదటి పూజ రోజున సమర్పిస్తారు. భారీ తొట్టెల ఊరేగింపును గురువారం మధ్యాహ్నం లంగర్‌హౌస్ చౌరస్తాలోని ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి బోనాల జాతర ప్రారంభిస్తారు. గోల్కొండ కోటపైకి తొట్టెలను డప్పు వాయిజ్యాలతో భక్తుల కోలహలంగా తరలిస్తారు. తొమ్మిది పూజలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపుగా తీసుకవచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.
పూజారి ఇంటి నుంచి
మూల విగ్రహాల ఊరేగింపు
గోల్కొండ కోటపై ఉన్న చారిత్రాత్మకమైన శ్రీ జగదాంభిక మహాంకాళి అమ్మవారి ఆలయం బోనాల ఉత్సవాల మొదటి రోజు మూల విగ్రహాలను గోల్కొండ బడాబజార్‌లో ఉన్న పూజారి ఇంటి నుంచి ఊరేగిస్తారు. ముందుగా పూజారి ఇంట్లో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పోతరాజుల విన్యాసాలు
బోనాలు అంటేనే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పోతరాజుల వేషధారణ. ఈ ఉత్సవాలల్లో పోతరాజుల విన్యాసాలు తప్పనిసరి. మేళతాళాలతో డప్పువాయిజ్యలతో భారీ తొట్టెల ఊరేగింపును పోతరాజుల విన్యాసాలతో గోల్కొండ కోటకు రాత్రి వరకు తరలిస్తారు.

మనమే నెంబర్‌వన్ కావాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 6: స్వచ్ఛనగరాలను ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో హైదరాబాద్ నగరం మొదటి స్థానం దక్కించుకునేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి సూచించారు. గత నెల 16 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు స్వచ్ఛ్భారత్‌పై జిహెచ్‌ఎంసి వివిధ అంశాలతో కూడిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! ప్రతి జోన్, సర్కిల్ స్థాయిలో స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా కాలనీల్లో నిర్వహించనున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, తడి,పొడి చెత్తలను వేర్వేరుగ సేకరించటం, కంపోస్టింగ్ గుంతల ఏర్పాటు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం తదితర అంశాలపై కమిషనర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, కాలనీ సంయేమ సంఘాల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో చెత్తను వేర్వేరుగ చేయటంతో పాటు చెత్తతో ఎరువుల తయారీని స్వతహాగా చేపట్టడానికి ప్రోత్సహించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఎక్కడైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఆయా కాలనీలను ఆదర్శంగా తీసుకుని ఇతరులకు తెలియజేయాలని సూచించారు.
ప్రతి వీధిని హరితమయం చేయాలి
నగరంలో పచ్ఛదనాన్ని పెంపొందించటంతో పాటు మరింత ఆహ్లాదకరమైన వాతారణాన్ని పెంపొందించేందుకు గాను ఈ నెల 11న నిర్వహించనున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిహెచ్‌ఎంసికి చెందిన ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ప్రతి వీధి, గల్లీని హరితమయం చేసే సంకల్పంతో ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహాంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. సర్కారు ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేందుకు వీలుగా ప్రజాప్రతినిధులు కూడా తగిన చొరవ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ముందుగా నిర్దేశించిన విధంగా ఇప్పటికే గుంతల తవ్వకాలు తుది దశలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సుమారు 3.57కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఒక్క సిటీలో పరిధిలోనే ఒక్క రోజు వ్యవధిలో దాదాపు 25లక్షల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించే దిశగా బల్దియా చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలన్నారు. అంతేగాక, కార్యక్రమం పకడ్బందీగా జరిగేందుకు వీలుగా సర్కిళ్ల స్థాయిల్లో డిప్యూటీ కమిషనర్లను పూర్తి స్థాయి ఇన్‌ఛార్జిలుగా నియమించామన్నారు.
మొక్కలు నాటే ప్రతి ప్రాంతానికి వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇంజనీర్లు, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లతో పాటు తదితర జిహెచ్‌ఎంసి సిబ్బంది, అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. ప్రాంతాల వారీగా ఇన్‌ఛార్జిలుగా నియమించిన అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ కెబిఆర్‌పార్కు వద్ధ స్వచ్ఛ వాలంటీర్లు, గ్రీన్ వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. 11న నిర్వహించే హరితహరంపై కెబిఆర్ పార్కు వద్ద ప్రత్యేక బ్యానర్‌ను ఏర్పాటు చేసి వాలంటీర్లతో మొక్కలు నాటే సంస్థలు, వ్యక్తుల పేర్లు, వారి సెల్ నెంబర్లు, మెయిల్ ఐడితో సహ సేకరించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

ప్రైజ్ మనీ పేరుతో మోసం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 6: ప్రైజ్ మనీ పేరుతో మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.65 లక్షలు నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాంద్‌బాగ్, ఢిల్లీకి చెందిన మహమ్మద్ జావెద్ అలియాస్ దీపక్ బన్సాల్ (29), జియావుద్దీన్ సైఫ్ (26)లు ముఠాగా ఏర్పడి ప్రైజ్‌మనీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. గత నెల 16న హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు శృతి, దీపక్ బన్సాల్, ఆకాష్, అరుణ్ శ్రీవాస్తవ్ పేరుతో తాము ఇండియా టుడే బుక్ క్లబ్, లైవ్ నెట్ సర్వీసెస్, టైమ్స్ షాపింగ్ మేనేజింగ్ డైరెక్టర్లమంటూ ఫోన్ చేశారు. మీరు రూ. 4.40లక్షలు గెలుచుకున్నారని, ఆ మొత్తం రూ. 53లక్షలు అయ్యాయని వీటిని తీసుకునేందుకు ప్రాసెసింగ్, పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఆ మహిళను నమ్మించారు. దీంతో ఆ మహిళ వారు సూచించిన బ్యాంకు అకౌంట్లలో రూ. 32 లక్షల వరకు డిపాజిట్ చేసింది. డబ్బులు డ్రా చేసుకున్నవారు తమ ఫోన్ నెంబర్లను మార్చేసుకున్నారు. ఎంతకూ సమాధానం రాకపోవడంతో సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న డిటెక్టివ్ డిపార్టుమెంట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక బృందం జావెద్, జియాఉద్దీన్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి నుంచి రూ. 1.65 లక్షలు నగదుతోపాటు, ల్యాప్‌టాప్, మోబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులను సైబర్ క్రైం డిసిపి అభినందించారు.

చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ సంఘటనతో
కళ్లు తెరిచిన రైల్వే యంత్రాంగం
సికింద్రాబాద్, జూలై 6: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా దారుణాలు జరిగితే తప్ప అధికార యంత్రాగం కళ్లు తెరవదన్న వాస్తవాన్ని నిజం చేస్తూ చిలకలగూడ సంఘటనపై రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త ఇటు వైద్య అధికారులతో అటు విచారణ కమిటీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. మెట్టుగూడ రైల్వే ఆసుపత్రితోపాటు, మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించిన రోగులు అందరూ కూడా కోలుకుంటున్నారని, కేవలం ఒకటి రెండురోజుల్లో వారిని వారి ఇళ్లకు పంపిస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేవలం వారి పర్యవేక్షణ కోసం ఆసుపత్రిలో ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హైద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ను అన్ని రైల్వే క్వార్టర్స్‌ను తనిఖీ చేయాలని అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సూచించడంతో రైల్వే అధికార యంత్రాంగంలో కదలిక ఆరంభమైంది. డిజిఎం బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో ఇంటింటికీ తిరుగుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేడిచేసిన నీటిని సేవించాలని చెబుతూ చుట్టుప్రక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అదే సమయంలో వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లను పంపిణీ చేశారు. ఇంకా కొత్తగా ఏమైనా కేసులు నమోదయ్యాయా అన్న విషయాన్ని ఆరా తీశారు. అదే సమయంలో భూగర్భ సంప్‌ను క్లీన్ చేయించడంతోపాటు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను కూడా శుభ్రపర్చడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. కాలనీలోని పైప్‌లైన్‌లను పరిశీలించారు. కాగా ఈ విషయంలో నీటి పరీక్షను జాయింట్‌గా చేయడానికి వాటర్‌వర్క్స్ అధికారులను సంప్రదించారు. రైల్వే జిఎం చిలకలగూడ సంఘటనపై వెంటనే స్పందించి భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగంలో కదలికలు తీసుకువచ్చారు.

ఎక్స్‌క్లూజివ్ మెగ్నీషియం పరిశ్రమలో అగ్ని ప్రమాదం
జీడిమెట్ల, జూలై 6: ఎక్స్‌క్లూజివ్ మెగ్నీషియం పరిశ్రమలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ప్లాట్ నంబరు 46లో ఎక్స్‌క్లూజివ్ మెగ్నీషియం ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో అండర్ గ్రౌండ్‌లోని బట్టీల్లో మెగ్నీషియం అలైన్‌తో అల్యూమినియం సంబంధించిన పరికరాలను మోల్డింగ్ చేసే క్రమంలో ఓవర్ హీట్ వచ్చి మంటలు చెలరేగాయి. బట్టీల్లో సుమారు 600 కెజీల వరకు మెగ్నీషియం అలైన్ ఉంది. పరిశ్రమలో మంటలు చెలరేగి పరిశ్రమ నుండి పొగలు ఉవ్వెత్తున వచ్చాయి. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఫైరింజన్‌తో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కాగా ఫైరింజన్‌తో మంటలు అదుపు చేయలేకపోయారు. బట్టీల్లోని మంటలను అదుపు చేసేందుకు పరిశ్రమ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పరిశ్రమలో 10 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని, మంటలు వచ్చిన వెంటనే బయటికి వచ్చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని పరిశ్రమ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రూ.15 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. జీడిమెట్ల సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మేజిక్‌తో సామాజిక రుగ్మతను పాలదోలాలి
హైదరాబాద్, జూలై 6: తెలంగాణ మేజిక్ అసోసియేషన్ పేరుతో మ్యాజిక్ కళాకారులతో ఒక నూతన కళాకారుల సంస్థ బుధవారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సిహెచ్ విఠల్ మాట్లాడుతూ మ్యాజిక్ కళాకారులు సామాజిక చైతన్యం కోసం సామాజిక రుగ్మతను పాలద్రోలే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
తెలంగాణ స్పోర్ట్ అథారిటీ విసి అండ్ ఎండి దినకర్ బాబు మాట్లాడుతూ మ్యాజిక్ అసోసియేషన్ ప్రారంభించడం చాలా సంతోషం అని చెప్తూ పునాదులు గట్టిగా వుంటే చిరకాలం నిలబడుతుందని అన్నారు. చేసే వృత్తిలో ప్రదర్శించే కళలో సమర్థత వుంటే ఎంతైనా సాధించవచ్చు అని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మ్యాజిక్‌లో శిక్షణ ఇస్తున్నట్లుగా అని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడితే ఈ కళ విశ్వవ్యాప్తమవుతుందని అన్నారు. తొలుత సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ మెజీషియన్ సామల వేణు మాట్లాడుతూ మ్యాజిక్ కోర్సులో చేరడానికి వయస్సు 18 సంవత్సరాలు, విద్యార్హత ఎస్‌ఎస్‌సి ఉత్తీర్ణులై వుంటే చాలని అన్నారు. చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను పాలద్రోలడానికి మేజిక్ కళ ఉపయోగపడాలని అన్నారు. సామలవేణు జన్మదినోత్సవం సందర్భంగా కళాకారులు, ప్రేక్షకుల సమక్షంలో పుట్టినరోజు కేక్ కట్ చేశారు. తొలుత మేజీషియన్‌లు తమ ప్రావీణ్యతను ప్రదర్శించారు. కార్యక్రమంలో టి.రాములు, వి.ఆనందగౌడ్, వై.వెంకటేశ్వర్లు, జి. భద్రయ్య పాల్గొన్నారు.

రంజాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, జూలై 6: రంజాన్ మాసం ఈదుల్‌ఫితర్ ఉత్సవాల్లో భాగంగా గురువారం రంజాన్ పండుగా సందర్భంగా ఈద్గాల వద్ద ఉదయం ఎనిమిది గంటల నుండి 11.30 గంటల వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద వన్‌వే ట్రాఫిక్‌ను అనుమతిస్తామని, ఈ ప్రాంతాల గుండా జనరల్ పబ్లిక్ అనుమతించడం లేదని నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. ఈ ఆంక్షాలు గురువారం ఉదయం 8.00 గంటల నుంచి 11.30 గంటల వరకు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రంజాన్ పండుగా సందర్భంగా మీరాలం, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ట్రాఫిక్ అంక్షాలు విధించారు.
* మీరాలం ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని పూరణపూల్, కమాటిపూర, కిషన్‌భాగ్‌తో పాటు బహదూర్‌పూర క్రాస్ రోడ్డు మీదుగా అనువ

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు
ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి తలసాని
చార్మినార్,జూలై 6: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలతోపాటు, బోనాల సంస్కృతిని దేశ విదేశాలకు తెలియజేయాలనే ఉద్ధేశ్యంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఈనెల 9 నుంచి రెండు రోజుల పాటు లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీమహాంకాళి దేవాలయ ఆలయ కమిటీ అధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయటం అభినందనీయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ మారెడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీలో బోనాల ఉత్సవాల సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా తలతరాలుగా జరుపుకుంటున్న గొప్ప పండుగ బోనాలు అని అన్నారు. పండుగను దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించి దేశ ప్రజలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుపుతున్న ఆలయ కమిటీకి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయ కమిటీ చైర్మెన్ సి.రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ జూలై 7 గురువారం ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బంగారు బోనం, అమ్మవారి ఘాటాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్, కోశాధికారి యు.సదానంద్ గౌడ్, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు రంగా రమేశ్‌గౌడ్, బల్వంత్ యాదవ్ పాల్గొన్నారు.
విద్యుత్ ఆదాకు బల్దియా చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 6: వివిధ ప్రభుత్వ శాఖల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు చేస్తున్న బల్దియా సౌరశక్తిని వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏటా రూ. 24 కోట్ల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తోన్న మహానగర పాలక సంస్థ గడిచిన కొంతకాలంగా విద్యుత్‌ను పొంపొదుపుగా వినియోగించేందుకు పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా ఇండోర్ స్టేడియంలో సౌరశక్తిని వినియోగించుకునేందుకు సిద్దమవుతోంది. ఇందుకు గాను ఓ ఎజెన్సీని ఎంపిక చేసేందుకు విద్యుత్ విభాగం ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కమిషనర్ అంబర్‌పేట ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రాక్టీసు చేస్తున్న రెగ్యులర్ క్రీడాకారులను కలిసి ఆయన ముచ్చటించారు. అయితే స్టేడియంలో తగిన విధంగా లైటింగ్ వ్యవస్థ అందుబాటులో లేదని, మరికొన్ని వౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని వివరించినట్లు కమిషనర్ తెలిపారు. సౌరశక్తిని వినియోగిస్తే తగినంత లైటింగ్ వస్తోందని కొందరు క్రీడాకారులు కమిషనర్‌కు వివరించగా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని ఇండోర్ స్టేడియంలలో సౌరశక్తితో లైట్లు వెలిగేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించిన కమిషనర్ ఈ సలహా ఇచ్చిన క్రీడాకారులను అభినందించారు. జంటనగరాల్లో ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రీడాకారులతో షెటిల్, బ్యాడ్మింటన్ ఆడారు.

ఆకుపచ్చ తెలంగాణకు అందరూ కలిసి రావాలి
సికింద్రాబాద్, జూలై 6: ఆకుపచ్చ తెలంగాణకు హరితహారం పునాది అవుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖామాత్యులు టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి కేవలం ప్రభుత్వం కృషి ఒక్కటే సరిపోదని ప్రజల సహకారంతోనే కార్యక్రమం విజయవంతం అవుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు, కాలనీ సంఘాలు, బస్తీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాల ఆవరణలో మొక్కలు నాటే విధంగా మతపెద్దలు బాధ్యతలను తీసుకోవాలని మంత్రి కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు మతపెద్దలు ఆధ్యాత్మిక గురువులు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ హరితహారం కార్యక్రమాన్ని బతుకమ్మ, బోనాల పండుగల మాదిరిగా పండుగ వాతావరణంలో ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. ఈ యేడాది రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని ఏర్పాట్లు చేస్తుందన్నారు. నగరంలో 3.5 కోట్ల మొక్కలు హెచ్‌ఎండిఎ అటవీ తదితర శాఖల ఆధ్వర్యంలో పంపిణీకి సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని రెండు వారాల పాటు కాలనీలు రహదారులు ఇళ్లు, కార్యాలయాలు ఇలా ప్రతిచోట మొక్కలను నాటుతున్నామని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ఎక్సైజ్ యువజన శాఖల పరిధిలో 55లక్షల మొక్కలను నాటాలని, వచ్చే సంవత్సరం రెండు కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ యేడాది కల్లు గీత కార్మికుల కోరిక మేరకు దాదాపు కోటి ఈత, తాటి మొక్కలను నర్సరీల ద్వారా పెంచాలని కల్లుగీత సొసైటీల ద్వారా ప్రభుత్వ స్థలాల్లో నాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా కలిసి రావాలని చెట్లను నాటడం ద్వారా హరిత తెలంగాణకు నాంది పలకాలని అన్నారు. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్య కోరల నుంచి భవిష్యత్ తరాలను రక్షించాలన్నా, ప్రజలను పీడిస్తున్న కరవుకోరల నుంచి తప్పించుకోవాలన్నా హరిత తెలంగాణగా తీర్చిదిద్దడం అత్యవసరమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి తెలంగాణ పౌరుడు విధిగా పాలుపంచుకుని తమ వంతు కర్తవ్యంగా చెట్లను నాటాలని మంత్రి పద్మారావు పిలుపునిచ్చారు.