రంగారెడ్డి

ఈస్ట్ సైబరాబాద్ ఫిర్యాదులకు 9490617111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 9: సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ప్రజలకు ఏదైనా సమస్యలుంటే 9490617111 నెంబర్‌కు వాట్స్‌ఆప్, ఎస్‌ఎంఎస్‌లు చేయడమే కాకుండా కాల్ కూడా చేయవచ్చునని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వరకట్న వేధింపులు, పోకిరీల వేధింపులు, అసాంఘిక శక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయవచ్చని అన్నారు, ఈ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని, ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెంబరుతో పాటు సైబరాబాద్ సిఓపి ఈస్ట్ అనే ఐడిని ఇంగ్లీష్ భాషలో, ట్విట్టర్‌లో సైబరాబాద్ సిఓపి ఈస్ట్ అనే ఐడికి పోస్ట్ చేయాలని వివరించారు. వారంలో శుక్రవారం మల్కాజ్‌గిరి డిసిపి కార్యాలయంలో, మంగళవారం ఎల్‌బి నగర్ డిసిపి కార్యాలయంలోనూ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటానని కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో కూడా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఆయా ప్రాంతాల్లోని ఐటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి, ఎల్‌బి నగర్ పరిధుల్లో పర్యవేక్షిస్తున్నట్లు, భువనగిరి జోన్‌ను కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆర్డినెన్స్‌లు రానందున తాము పర్యవేక్షించడం లేదని అన్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ నూతనంగా ఏర్పడినందున సొంత కార్యాలయానికి స్థలాన్ని అనే్వషిస్తున్నట్లు, ప్రైవేటు భవనం కోసం కూడా చూస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ హరితహారంలో భాగంగా తమ కమిషనరేట్ పరిధిలో 51వేల మొక్కలు నాటుతున్నామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
ర్యాగింగ్ చేస్తే కఠినచర్యలు
ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతున్నందున నూతనంగా కళాశాలకు వచ్చే విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఇప్పటికే తమ ఆయా పరిధుల్లో అధికారులు ఆయా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు కూడా ర్యాగింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఏదైనా సంఘటన జరిగితే కళాశాలలపై కేసులు పెడతామని హెచ్చరించారు. అన్ని కళాశాలల్లో యాంటీ రాగింగ్‌పై పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా వచ్చే విద్యార్ధులకు స్నేహపూర్వకంగా పరిచయం చేసుకోవాలే కాని ర్యాగింగ్ పేరుతో క్రూరంగా వ్యవహరించడం ఆటవిక చర్య అన్నారు. ప్రతినెలలో ఒక రోజు ‘డయల్ యువర్ కమిషనర్‌‘ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతానని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.