రంగారెడ్డి

ఉద్యమంలా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజలంతా ఉద్యమంలా చేపట్టాలని ఇంటింటికీ మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని హరితహారం కో-ఆర్డినేటర్, సిఎం కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ పిలపునిచ్చారు. శనివారం మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలోని రైల్వేస్టేషన్ కాలనీ, లక్ష్మీనగర్ తదితర కాలనీల్లో ర్యాలీలు నిర్వహించి ఆమె ఇంటింటికీ తిరుగుతూ మొక్కల పెంపకంపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలతోనే భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని తమ పిల్లల వలే సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పచ్చదనంతోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కరవు కాటకాలకు అడవుల శాతం కుంచించుకుపోవడమేనని వివరించారు. భవిష్యత్తు తరాలకు వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని ముందుచూపుతో ప్రభుత్వం బృహత్తరమైన హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొక్కలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఈ యేడాది అనుకున్న మేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. గ్రామాలు, పట్టణాలు పూర్తిగా హరితవనంగా మారాలని ఆకాంక్షించారు. చెట్లతో అనేక లాభాలున్నాయని తెలిపారు. హరితహారంలో ఆమె ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛంద సంస్థల వారు ప్రజల్లో చెట్ల పెంపకంపై చైతన్యం కలిపించాలని కోరారు. ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలు కరుస్తున్నందున విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు. గుండ్లపోచంపల్లి గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు గ్రామంలోని అన్ని ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్టు సర్పంచ్ పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామంలోని పలు కాలనీల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ తరఫున ఇంటింటికీ మొక్కలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుండ్లపోచంపల్లిని జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన తెలంగాణం హరితహారం ర్యాలీకి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఎంపిపి విజయలక్ష్మీ, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహాయం, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఎంపిటిసిలు మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, బిజెవైఎం విక్రంరెడ్డి, వార్డు సభ్యులు జైపాల్‌రెడ్డి, యాదగిరి, సుజాత, విజయ, కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, దేవేందర్, స్థానిక నాయకుల మలికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో హరితహారం విజయవంతం చేయాలి