రంగారెడ్డి

18 వయస్సులోపు.. పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 15: 18 సంవత్సరాల్లోపు బాల బాలికలను పనిలో పెట్టుకుంటే చట్టరిత్య చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వేల్ఫేర్ అధికారులతో, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్లతో, ఇతర పోలీసు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు, ఎస్‌ఐ, ఎఎస్‌ఐలు టీమ్‌లుగా ఏర్పడి యాచిస్తున్న చిన్నారులు, బడిబయట ఉన్న చిన్నారులు, హోటళ్లు, ఇతర షాపింగ్ మాల్స్‌లో పని చేస్తున్న బాల బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో జోత్స్న, డీబీసీ డీవో పుష్పలత, డీసీపీవో రాజేష్‌కుమార్, ఏఎస్‌డబ్ల్యూవో ఉమాపతి, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ వెంకటేశం ఉన్నారు.

ప్రజల అభ్యున్నతికి నిరంతర కృషి
* కొత్తూరు ఎంపీపీ మధుసూధన్‌రెడ్డి
కొత్తూరు, జూన్ 15: తనపై నమ్మకం పెట్టి గెలిపించిన ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతానని కొత్తూరు ఎంపీపీ పిన్నింటి మధుసూధన్‌రెడ్డి అన్నారు. శనివారం కొత్తూరు మండలం మల్లాపూర్‌తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇందిరానగర్‌కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు వివరించి, వాటిని ప్రతి ఒక్కరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మండల ప్రజలు తనపై నమ్మకం పెట్టి గెలిపించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్తూరు మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ దర్శన్, వార్డుసభ్యుడు నవీన్, పెంటయ్య, శ్రీశైలం, రాజేష్, చెన్నయ్య, ప్రవీణ్, మల్లేష్, రవి పాల్గొన్నారు.