రంగారెడ్డి

రోడ్డులో గుంతలపై కలెక్టర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 15: నారపల్లి-పర్వతాపూర్ మధ్యలో రోడ్డు గుంతలపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మేడిపల్లి మండలం పరిధిలో పర్యటనలో భాగంగా ఈ రోడ్డులో స్వయంగా ప్రయాణించారు. అడుగడుగునా ఉన్న గుంతలతో ఇబ్బందులు పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో గుంతలు పడినా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులపై భగ్గుమన్నారు. రోడ్ల పరిస్థితి ఇలాఉంటే ఎలాఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గతంలో రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌ను గుర్తించి నివేదిక సమర్పించాలని పీర్జాదిగూడ పురపాలక సంఘం కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించమని హెచ్చరించారు.

మెరుగైన సేవలు అందిస్తున్నాం

*ఉత్తమ ఆసుపత్రిగా జేర్మంటెన్ * డాక్టర్ మీర్ జావేద్ జర్‌ఖాన్
రాజేంద్రనగర్, జూన్ 15: జేర్మంటేన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తుందని డాక్టర్ మీర్ జావేద్ జర్‌ఖాన్ అన్నారు. జెర్మంటేన్ ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా గుర్తింపు లభించిందని శనివారం తెలిపారు. మాట్లాడుతూ తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎంతో మందికి తక్కువ ఫీజుతో సేవలందించామని తెలిపారు. గత 45 సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులు సైతం ఆర్థోపెడిక్ డాక్టర్లుగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. గతంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని డైరీఫాం వద్ద ఏర్పాటు చేశామని, ఇటీవలే ఉప్పర్‌పల్లిలో సైతం నూతనంగా మరో బ్రాంచ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పుల చికిత్సలో డాక్టర్లు అనవసర ఆపరేషన్లు చేస్తున్నారని అన్నారు. దీని కారణంగా 10 ఏళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయే తప్ప ఎటువంటి మార్పు ఉండటం లేదని అన్నారు. తమ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. సాధ్యమైనంత ఆపరేషన్ లేకుండానే చికిత్స చేస్తున్నామన్నారు. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే జర్మన్, భారత టెక్నాలజీల ఆధారంగా 25 నిముషాలలో ఆపరేషన్‌ను చేస్తున్నామన్నారు. జర్మన్ టెక్నాలజీతో వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. కీళ్లనొప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తక్కువ ఫీజుతో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తామని వివరించారు.
బాలికల ఆరోగ్య పరిరక్షణ కిట్లు అందజేత
మేడ్చల్, జూన్ 15: మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం బాలిక విద్య గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాలికల విద్య గురించి, బాలికల ఆరోగ్యం, పరిరక్షణ గురించి కిట్ల గురించి సర్పంచ్ వీర్లపల్లి గీత భాగ్యరెడ్డి విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులను చదువాలని సర్పంచ్ కోరారు. బాలికలకు ఆరోగ్య పరిరక్షణ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజమల్లా రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు బాలేశ్, జడ్పీ కోఅప్షన్ సభ్యులు గౌస్‌పాషా, నాయకులు భాగ్యరెడ్డి, రాజమల్లేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దిష్టిబొమ్మ దగ్ధం
యాచారం, జూన్ 15: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఉపాధి హామీ పథకం లక్ష్యం పూర్తిగా నిర్వీర్యం అవుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీ.అంజయ్య విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని నజ్దీక్‌సింగారం, మొగుళ్లవంపు గ్రామాల్లో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వ్యకాస జిల్లా కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తోందని పథకంలో పనిచేస్తున్న కూలీలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు జంగయ్య, ప్రభాకర్‌రెడ్డి, ఉపాధి పథకం మేట్లు, కూలీలు రాములు, చెన్నారెడ్డి, పద్మ, నరసమ్మ, గోపాలు, లక్ష్మమ్మ, జంగమ్మ, మల్లయ్య, అంజమ్మ, జంగయ్య, లక్ష్మమ్మ, రాములు పాల్గొన్నారు.