రంగారెడ్డి

శ్మశానవాటిక కబ్జాను అడ్డుకోవాలని వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 19: మేడ్చల్ పురపాలక సంఘం బ్యాంక్ కాలనీలో మాలల కోసం ఏర్పాటు చేసిన శ్మశానవాటిక స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని అధికారులు వెంటనే స్పందించి కబ్జాదారుల చెర నుంచి స్థలాన్ని కాపాడాలని కోరుతూ బుధవారం తహశీల్దార్ వెంకట్ రెడ్డిని మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ పెద్ద చెరువును అనుకుని ఉన్న అక్రమ కట్టడాలను సైతం తొలగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, పానుగంటి మహేశ్, కృష్ణమూర్తి, శేషాద్రి, పురుషోత్తం పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్యశిబిరానికి స్పందన
మేడ్చల్, జూన్ 19: మండలంలోని మునీరాబాద్ గ్రామంలో బుధవారం ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన శిబిరాన్ని సర్పంచ్ గణేశ్ ప్రారంభించి మాట్లాడుతూ నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, గ్రామస్థులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో సుమారు 80 మంది కంటి పరీక్షలు నిర్వహించి అందులో 20 మందికి శాస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు తేల్చారు. మరో 20 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. కార్యక్రమంలో వైద్యులు సికిద్ధర్, కుమార స్వామి, ఉష, ఉపసర్పంచ్ నర్సింగ్ రావు, కార్యదర్శి మల్లారెడ్డి, వార్డు సభ్యులు నరేందర్, శ్రీవాణి పాల్గొన్నారు.

ప్రజా సేవలో మంత్రి మల్లారెడ్డి తనయుడు
ఉప్పల్, జూన్ 19: మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజారీటితో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న చామకూర మల్లారెడ్డి బిజీగా ఉండటంతో తనయుడు చామకూర భద్రా రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. బుధవారం బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెంగిచర్లలో స్యయంగా పర్యటించారు. స్థానిక ఎంపీటీసీ బింగి భాగ్యమ్మ జంగయ్య, కాలనీ సంక్షేమ సంఘం పెద్దలతో కలిసి మై విలాస్, క్రాంతికాలనీ, ద్వారకానగర్, శివశక్తి, ఆర్టీసీ కాలనీ, ప్రశాంత్‌నగర్, దుర్గరెసిడెన్సీ, నారాయణ ఎన్‌క్లేవ్, వెంకటసాయి నగర్‌లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు సన్మానం
కొందుర్గు, జూన్ 19: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంతో పాటు రేగడిచిల్కమర్రి, ముట్పూర్, టేకులపల్లి గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జడ్పీటీసీ ఎదిర రాఘమ్మ, ఎంపీపీ పోతురాజు జంగయ్య, వైస్ ఎంపీపీ రాజేష్‌పటేల్, ముట్పూర్ ఎంపీటీసీ రాంరెడ్డిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు నర్సింహారెడ్డి, పవిత్రాదేవి, నాయకులు నాయకులు మల్లారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పోతురాజు గోపాల్, బందులాల్, హరీష్, వెంకటేష్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు బ్యాంకు రుణాల కోసం ఇంటర్వ్యూలు
ఉప్పల్, జూన్ 19: పీర్జాదిగూడ పట్టణంలోని నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కింద 2018-2019 ఆర్ధిక సంవత్సరంనకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు మేనేజర్ల సమక్షంలో ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ ఐడెంటీఫికేషన్ క్యాంపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వాణీరెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న యువతీ, యువకులు సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు.
మల్కాజిగిరి డివిజన్ అభివృద్ధికి కృషి
నేరేడ్‌మెట్, జూన్ 19: మల్కాజిగిరి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని డివిజన్ కార్పొరేటర్ ఎన్.జగదీష్ గౌడ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని బలరాంనగర్‌లో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన సిమెంట్ రోడ్డు పనులను బుధవారం కాలనీ వాసులతో కలసి ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. అన్ని కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ,నీటి సౌకర్యం కల్పించేందకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏ ఇ దివ్యజ్యోతి, రమేష్, నాయకులు వికే. మహేష్, మోహన్‌రెడ్డి, వినయ్ గౌడ్, సుధాకర్, జ్ఞానేశ్వర్, కిరణ్, కృష్ణ, శ్రీకాంత్, నవీన్, సూరీ, తుపాకుల జనార్ధన్, సైదులు, ఉమాదేవి, కరుణ, సురేష్ సింగ్, గొపాల్‌రావు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.