రంగారెడ్డి

గౌడబస్తీలో కార్పొరేటర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, జూన్ 19: బాలానగర్ డివిజన్ గౌడబస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరిస్తానని కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య అన్నారు. బుధవారం పాదయాత్ర నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. బస్తీలో తరచూ డ్రైనేజీ సమస్య ఏర్పడుతుందని తెలపగా స్పందించిన డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణానికి ప్రణాళికలు వేయాలని ఏఈ రషీద్‌కు సూచించారు. వార్డు కమిటీ సభ్యుడు బీ.నాగేందర్ గౌడ్, ఆలయ చైర్మన్ వై.యాదగిరి, పీ.శ్రావణ్, ఎన్.దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
దశలవారీగా సమస్యలను పరిష్కారిస్తా
బాలాపూర్, జూన్ 19: జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కారిస్తానని మహేశ్వరం ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లెలగూడ మున్సిపాలిటీ సాయి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పలువురు టీఆర్‌ఎస్ నేతలు వివరించారు. సబితా రెడ్డి మాట్లాడుతూ తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కారిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో సిద్దాల అండాళ్లు బీరప్ప, ఎనుగుల అనిత అనిల్ కుమార్ యాదవ్, కోట్యా నాయక్, సిద్దాల బీరప్ప, కాలనీవాసులు సుదర్శన్ రెడ్డి, అంజనేయ రెడ్డి, చంద్రారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు
బాలాపూర్, జూన్ 19: రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి జన్మదిన వేడుకలను పురష్కరించుకొని బుధవారం రంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ రామిడి శూరకర్ణా రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. నర్సింహా రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.