రంగారెడ్డి

హైటెక్ పాఠశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మేడ్చల్ పట్టణంలో హైటెక్ స్కాలర్స్ స్కూల్‌లో 8, 9, 10 తరగతులు నడుపుతున్నారని అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ కార్పొరేటు విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఎటువంటి అనుమతులు లేకుండా బహిరంగంగా నడుపుతుంటే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వారికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. నియమ నిబంధనలు పాటించని పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకుంటే తల్లితండ్రులు, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని లేకుంటే పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు స్పందించిన విద్యాధికారులు పాఠశాల వద్దకు చేరుకుని నిర్వాహకులకు తాఖీదులు జారీ చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, నర్సింగ్ రావు, శేఖర్, చందు, ప్రశాంత్, అర్జున్, విజయ్, సమీర్, నవీన్, సాయి, చరణ్ రెడ్డి, మోహన్, కార్తీక్, అజయ్ పాల్గొన్నారు.
రేపు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
మేడ్చల్, జూన్ 24: మేడ్చల్ మండల పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని ఎంపీపీ కే.విజయలక్ష్మీ అధ్యక్షతన రేపు (బుధవారం) ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ పద్మావతి ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు తమ పూర్తి నివేదికలతో సకాలంలో హాజరై దిగ్విజయం చేయాలని ఎంపీడీఓ కోరారు.