రంగారెడ్డి

కలెక్టర్‌ను ఆదర్శంగా తీసుకున్న మోమిన్‌పేట్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట్, జూన్ 24: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదర్శంగా తీసుకోని మోమిన్‌పేట్ మండల అఖిలపక్షం నేతలు ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ముందుకు వచ్చి, సోమవారం ఆర్డీవో విశ్వనాథాన్ని కల్సి మండల కేంద్రం ఆంగ్ల మాధ్యమం పాఠశాల ఏర్పాటు చేస్తే, నిరుపేద, విద్యార్థులను చేర్పించి, ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు మాణయ్య యాదవ్, రమేష్ ముదిరాజ్, సిరాజోద్ధీన్, కే.నారాయణ, ఏజాజ్, పటేల్ పాల్గొన్నారు.
త్వరగా కోల్ కాలువ నిర్మాణ పనులు
జీడిమెట్ల, జూన్ 24: కోల్ కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకులు కేఎం ప్రతాప్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఉపకమిషనర్ మంగతాయారుని కలిసిన ప్రతాప్ కోల్ కాలువ పరిస్థితిని వివరించారు. ప్రతాప్ మాట్లాడుతూ జీడిమెట్ల పరిధిలోని కోల్ కాలువ నిర్మాణం పనులను రూ.3 కోట్లతో పనులను చేపట్టాలని, కాని డీఈ లాల్ సింగ్ కోల్ కాలువ విషయంలో ఎలాంటి సంబంధం లేకున్నా, దాని పొడువు, వెడల్పు, లోతు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులు రాకున్నా, ప్లాన్ లేకుండా కొందరి స్వలాభానికి రెండు రోజుల క్రితం ఏకపక్ష నిర్ణయంలో కోల్ కాలువ పనులను కాలువ మధ్యలో పనులను చేపట్టారని, ప్రారంభంలో గాని, ముగింపులో పనులను చేపట్టాల్సి ఉండగా మధ్యలో పనులను చేయడం పై మండిపడ్డాడు. ప్రజాప్రతినిధులకు, కాలనీ సంక్షేమ సభ్యులకు, అధికారులకు తెలియకుండానే కాలువ పనులను చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్వలాభానికి పాల్పడుతూ ఏకపక్ష నిర్ణయాలతో కోల్ కాలువ పనులను చేపడుతున్న డీఈ లాల్‌సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కోల్ కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, టీఆర్‌ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.