రంగారెడ్డి

దేశం గర్వించేలా తెలంగాణ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూస్తోందని, రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి పరుస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీ.సునీతా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఎకరం స్థలంలో టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వికారాబాద్ మండల పరిషత్ భవనాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుతో కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ నేతలు ఎల్లప్పుడు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. గతంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీటిని సరఫరా చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టి దేశం గర్వించేలా చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. జిల్లాను ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

నీటి కోసం ఆందోళన
కొడంగల్, జూన్ 24: గత కొన్ని రోజులుగా కొడంగల్ పట్టణంలో తాగునీరు రావడం లేదని పట్టణ వాసులు ఆందోళనకు దిగారు. సోమవారం ఆర్‌డబ్లుఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నీళ్లు ఇస్తామని గోప్పలు చెప్పిన ప్రభుత్వాలు తాగు నీరు ఇవ్వడంలో విఫలం చెందారని పలువురు విమర్శించారు. కార్యాలయం ఎదుట ఆందోళన చెపట్టడంతో పరిస్థితిని తెలుసుకున్న సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని కొన్ని సమస్యల కారణంగా నీరు రావడం లేదని త్వరలోనే సమస్యలను పరిష్కారించి ప్రతి రోజు నీరు అందించేందుకు కృషి చేస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విమరించారు.

కష్టపడే వారికే పార్టీ పదవులు
*డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్
కీసర, జూన్ 24: పార్టీ కోసం కష్టపడే వారికే పార్టీ పదవులు కేటాయిస్తామని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. సోమవారం శ్రీశైలం గౌడ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తరుపున గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిల్, డివిజన్, బ్లాక్, మున్సిపాలిటీ, మండలాల పరిధిల్లో గతంలో నియమించిన అన్ని పోస్టులను రద్దు చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని నియమించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతామని, కార్యకర్తలు కష్టించి పార్టీ అభ్యర్థులను గెలిపంచు కోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఒబీసీ మీడియా సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రొయ్యల మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలకు వితరణ
కీసర, జూన్ 24: కీసర ప్రభుత్వ పాఠశాలకు ఉయ్ ఛారిటీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మరుగుదొడ్లకు డోర్‌లు, తాళాలు, ఫినాయిల్ బాటిళ్లను సోమవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కే.శ్రీనివాస్‌కు అందజేసారు. ప్రధానోపాద్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మరుగుదొడ్లకు డోర్‌లు లేకపోవటంతో విద్యార్థిలను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సహకారం అందించటం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాయకపు మాధురి పాల్గొన్నారు.