రంగారెడ్డి

బయట నీతి బోర్డులు.. లోపల అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 12: తహశీల్దార్ కార్యాలయం బయట పెద్దపెద్ద అక్షరాలతో అవినీతి రహిత ఆఫీసు అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం.. లోపలికి వెళ్తే అంతా అవినీతి కంపుకొడుతుంది. దొరికితే దొంగలు.. లేదంటే దొరల్లా ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ఎవరి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదని.. నిస్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నామని గొప్పగా మాటలు చెబుతుంటారని, లోపల మాత్రం కాసులు ఇస్తేనే ఫైళ్లు ముందుకు వెళ్తాయే తప్ప మరో మాట ఉండదు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకవైపు ఉద్యోగం చేస్తున్నామంటునే మరోవైపు దర్జాగా రియల్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తునే సంఘటనలు షాద్‌నగర్ డివిజన్‌లో అనేకంగా ఉన్నాయ. వివిధ రకాల సమస్యలతో ముడిపడిన భూములు ఎక్కడ ఉన్నాయి.. వాటిని పరిష్కరిస్తామంటూ సంబంధిత రైతుల వద్దకు రెవెన్యూ శాఖ అధికారులే వెళ్లి చర్చలు మొదలు పెడుతున్నారు.
మీ భూమి సమస్యలు పరిష్కరిస్తాం.. అందుకు ఇంత ఖర్చు అవుతుందని లెక్కలు వేసి మరి చెబుతూ సామాన్య రైతుల నుండి డబ్బులు దండుకోవడమే పనిగా అధికారులు పెట్టుకున్న సంఘటనలు డివిజన్‌లో అనేకంగా ఉన్నాయని చెప్పవచ్చు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న.. పనిచేసిన ఉద్యోగులు కోట్ల రూపాయలకు పడగలెత్తారంటే ఆశ్చర్యపడనక్కరలేదు. కొన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారంలోకి నేరుగా వెళ్లకుండా మధ్యలో దళారులను రంగంలోకి దించుతున్నారు. తహశీల్దార్ కార్యాలయాలే అడ్డాలుగా మార్చుకొని కొందరు రియల్ వ్యాపారం చేస్తుంటే ఉన్నతాధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారని, వీరందరి ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్.. భూప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తమ తహశీల్దార్‌గా అవార్డు పొంది అక్రమ సంపాదనలో మాత్రం రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహశీల్దార్ లావణ్య తీరుపై పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేశంపేటలో క్రమంగా భూ బాధితుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై వచ్చి దానిలో మనమందరం పంచుకుందామని అవినీతికి పాల్పడినట్లు తెలుస్తొంది. 2016 నవంబర్ 21న కేశంపేట తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి మండలంలో గట్టిగా పట్టు సాధించారు.
ఈ ప్రాంత వ్యవసాయ భూములకు రెక్కలు రావడంతో రియల్ వ్యాపారంపై ఒక్కసారిగా కనె్నశారు. దాంతో రియల్ మాఫీయాతో కుమ్మక్కై ఎక్కువగా వివాదాలు ఉన్న భూములను మాత్రమే ఎంచుకునే వారు. తహశీల్దార్ పేరు ఎక్కడ బయటకు రాకుండా దళారీలను రంగంలోకి దింపి భూ వివాదాలు సెటిల్‌మెంట్లు చేసేవారని తెలుస్తొంది. కుల ధ్రువీకరణ పత్రాల నుండి మొదలుకొని భూ రికార్డుల మార్పిడి.. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు వరకు ప్రతి పనికి వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తుండేవారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయం బయట అవినీతి రహిత కార్యాలయం అని.. వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు డబ్బులు అడిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలంటూ ప్లెక్సీని ఏర్పాటు చేశారు..కానీ తహశీల్దారే అతిపెద్ద అవినీతి తిమింగ్లమని తెలియడంతో జనం అవాక్కయ్యారు. ప్రభుత్వ ఆఫీసుల్లో నెలకొన్న అవినీతి నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావంతులు పేర్కొంటున్నారు.