రంగారెడ్డి

మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 15: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయంటూ రాజకీయ పార్టీల నేతల్లో సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు టికెట్ల కోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్లు ఆశిస్తున్న నేతల్లో గెలుపు గుర్రాలు ఎవరనే విషయం కోసం అధిష్టానాలు సర్వేలు మొదలు పెట్టాయి.
ఎలాగైనా షాద్‌నగర్ మున్సిపాలిటిలో గులాబీ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ నాయకులు రంగం సిద్ధం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తామేమి తక్కువ కాదంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి అంటూ రాజకీయ పార్టీల నేతలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే వార్డుల వారిగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
వార్డుల్లో వీధి దీపాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించేందుకు కృషి చేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తునే మరోవైపు పనులు మొదలు పెడుతున్నారు. మరికొన్ని వార్డుల్లో రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటి సమస్యను గుర్తించి ట్యాంకర్లతో ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రజల్లోకి వెళ్లి సేవలు చేస్తూ ఓటర్ల మన్ననలు పొందుతున్నారు. రిజర్వేషన్లు ఎలా వస్తాయో తెలియదు..కానీ నేతలు మాత్రం పోటీపడి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. షాద్‌నగర్ పురపాలక సంఘంలో గతంలో 23వార్డులు ఉండగా ప్రస్తుతం 28వార్డులకు పెంచారు. దాంతో పెద్దగా ఉన్న వార్డులు చిన్నచిన్నగా మారిపోవడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.