రంగారెడ్డి

అక్రమ నిర్మాణాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 18: నిజాంపేట్‌లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. మండల తహశీల్దార్ గిరి ఆధ్వర్యంలో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో మూడు భవనాలను కూల్చివేశారు. నిజాంపేట్ గ్రామంలోని బండారి లే అవుట్ కాలనీలో తుర్క చెరువు కట్టకు ఆనుకుని నిర్మిస్తున్న రెండు భవనాలను, సర్వే నెంబర్ 191లో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు. తహశీల్దార్ గిరి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే ఎంతవారైనా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నార్సింగి: అక్రమ కట్టడాలను గండిపేట్ తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది గురువారం కూల్చివేశారు. సర్వే 51లో నిర్మిస్తున్న కట్టడాలపై కొరడా ఝులుపించారు.
సర్వే 51 ప్రభుత్వ స్థలంగా గుర్తించి అధికారులు గతంలో సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. స్థలంలో కొందరు నిర్మాణాలు చేపట్టి ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం కే.స్వప్న అనే మహిళ అదనపు గదులను నిర్మిస్తుంది. ఇంటి ఎదురుగానే మరో వ్యక్తి షెడ్‌ను ఏర్పాటు చేశాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దార్ సైదులు ఆధ్వర్యంలో పరిశీలించి నిర్మాణాలను కూల్చేందుకు జేసీబీతో వచ్చారు. నిర్మాణాలను కూల్చేందుకు ప్రయత్నించడంతో ఇంటి యజమానులు స్వప్న ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు సముదాయించారు. జేసీబీతో కూల్చేందుకు ప్రయత్నించడంతో జేసీబీ ముందు పడుకొని నిరసన తెలిపింది. ఇరవై ఏళ్లుగా నిర్మించుకొని నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదనపు గదులను నిర్మిస్తుంటే కూల్చివేయడం అన్యాయమన్నారు. 20 సంవత్సరాలుగా అన్ని పన్నులు కట్టామని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు అధికారులు కట్టడాలను కూల్చివేశారు.
వనస్థలిపురం: హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది సహాయంతో కూల్చివేశారు. డివిజన్ పరిధిలోని సాగర్ రహదారిలో భనవ నిర్మాణదారుడు మూడు అంతస్తులకు జీహెచ్‌ఎంసీ నుండి అనుమతులు తీసుకుని అదనంగా మరోరెండు అంతస్తులను నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.
గురువారం అక్రమంగా వెలసిన రెండు అంతస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. జీహెచ్‌ఎంసీ అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న భవనాలను కూల్చి వేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తుల్జాసింగ్, రమేష్ పాల్గొన్నారు.