రంగారెడ్డి

సంక్షేమ హాస్టళ్లలో వౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూలై 21: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులకు మెరుగైన వసతులు, సదుపాయాలు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు డివిజన్‌లోని అన్ని మండలాల హాస్టల్ వార్డన్లకు సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోహిత్ రెడ్డి సంబంధిత సాంఘీక సంక్షేమ శాఖ అధికారులతో వసతి గృహాలలో విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీ.సీ, మైనార్టీ హాస్టళ్లు గురుకుల వసతి గృహాలలో చదువులు సాగిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తగిన స్థాయిలో వౌలిక వసతులు కల్పించాలని పునరుద్గాటించారు. సంక్షేమ శాఖ హాస్టళ్ల వార్డెన్‌లు ఎమ్మెల్యేను సత్కరించారు.

వర్షాలు కురవాలని ప్రార్థన
నార్సింగి, జూలై 21: వర్షాలు సకాలంలో కురువాలని ముస్లింలు ఆదివారం హిమాయత్‌సాగర్ జలాశయం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీరంచెరువు మాజీ వార్డు సభ్యుడు అమీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జమాయత్ ఉల్ ఉల్మా నగర అధ్యక్షుడు వౌలానా ముష్తీ ప్రార్థనలను జరిపారు. విస్తృతంగా వర్షాలు కురిసి జీవకోటి సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశామని అన్నారు. ప్రార్థనల్లో రహీం, లుక్మాన్, అక్బర్, రహముద్దీన్, ఫయాజ్, తాహేర్ పాల్గొన్నారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఘట్‌కేసర్, జూలై 21: ఆసరా పింఛన్లను పెంచి పేదలను ఆదుకున్న కేసీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. అన్నోజిగూడలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేసారు. పెంచిన ఆసరా పింఛన్ల పెంపుతో పేద ప్రజల ముఖాలలో వెలుగులు నిండినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోచారం పురపాలక సంఘ టీఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి సాయిరెడ్డి, నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.