రంగారెడ్డి

మేడ్చల్‌లో మళ్లీ విజృంభిస్తున్న డెంగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 23: మేడ్చల్‌లో డెంగీ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. సీజనల్ వ్యాధుల ఫలితమో లేక పారిశుద్ధ్య నిర్వహణ లోపమో తెలియదు కానీ గత కొన్ని రోజలుగా వివిధ రకాల వ్యాధులు జ్వరాలతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని ఏకలవ్య నగర్ చెందిన లక్ష్మన్(38) అనే వ్యక్తి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ అని తెలింది. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు కొంపల్లిలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా అత్వెల్లి గ్రామానికి చెందిన అనురాధ(35), మధులిక(10)అనే బాలిక డెంగీ బారిన పడటంతో వారికి కొంపల్లి ప్రాంతంలోని హర్ష ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్‌లో పలు చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని టైఫాడ్, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయని అధికారులు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు ఆందోళన వక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏప్పటికప్పుడు తెలుసుకుని తగు చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.
మెట్రోరైలుకు పటిష్టమైన సిసిటివి నెట్‌వర్క్

అక్రమ నీటి కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్

కుక్కను చంపిన స్థలం పరిశీలన
పరిగి, జూలై 23: తుపాకితో కుక్కను కాల్చిచంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో జరిగింది. ఒక వ్యక్తి కుక్కను తుపాకీతో కాల్చి చంపి దానిని రికార్డు చేసి యు ట్యూబ్‌లో పెట్టాడు. దీనిని చూసిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ రాష్ట్ర డిఐజికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఆదేశాల మేరకు డిఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

నాలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

శేరిలింగంపల్లి, జూలై 23: వరదనీరు ప్రవహించే నాలాలను ఎంతటివారు కబ్జా చేసినా నిర్దాక్ష్యింగా కూల్చివేయాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం చందానగర్ డివిజన్ పరిధిలోవని దీప్తిశ్రీ నగర్ కాలనీలో సిబిఆర్ ఎస్టేట్స్ వెనుక భాగంలో గల నాలాను ఆక్రమిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ నవతరెడ్డి వెళ్లి నాలాను పరిశీలించారు.నిబంధనలకు విరుద్ధంగా నాలాను, రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న భవన సముదాయాలను శేరిలింగంపల్లి సర్కిల్ 12 ఎసిపి కె.మహిపాల్ రెడ్డి, టిపిఎస్ రాజలింగం, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణలను వెంటనే తొలగించి, నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. నాలా, లే అవుట్‌లలోని పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను ఎవరు ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కార్పొరేటర్ నవత రెడ్డి సూచించారు.ఇందులో టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బ విజయ్‌రెడ్డి, కృష్ణా రెడ్డి, పోచయ్య, సులోచనలతో పాటు శాంతినగర్, ఆదర్శనగర్ కాలనీల వాసులు ఉన్నారు.

హాస్టళ్ల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమా..?
చేవెళ్ల, జూలై 23: హాస్టళ్లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని దళితుల అభివృద్ధి శాఖ సలహాదారు ఎ.రామలక్ష్మణ్ (రిటైర్డ్ ఐఏఎస్) అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన చేవెళ్లలోని ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కలియ తిరిగారు. బిసి వసతి గృహంలో పిల్లలు ఉండే గదులను పరిశీలించారు.
అదేవిధంగా కిచెన్ షెడ్, మరుగు దొడ్లను చూశారు. వర్షానికి తడిగా మారిన గోడలను పరిశీలించారు. హాస్టల్ బిల్డింగ్‌పై నీరు నిలవడం కారణంగానే గోడల్లోకి నీరు వస్తోందని, వెంటనే బిల్డింగ్‌పై నీరు నిలవకుండా మొక్కలను తొలగించాలని సూచించారు. హాస్టల్‌లో సౌకర్యాలు ఇలాఉంటే ఎలా అని ప్రశ్నించారు. మీ హస్టల్ అధ్వాన్నంగా ఉందని వార్డెన్ లావణ్యకు చెప్పారు. మీ ఇల్లు ఇలాగే ఉంచుకుంటారా? అని ప్రశ్నించారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ఎన్నోఏళ్ల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరువలో ఉండటాన్ని గమనించారు. అదేవిధంగా కరెంట్ వైరింగ్ అస్తవ్యస్తంగా ఉండటంతో షార్ట్‌సర్య్కూట్ జరిగే ప్రమాదముందని, వెంటనే వైరింగ్ చేయించాలని అధికారులకు సూచించారు.
పిల్లలకు నీరు ఎక్కడినుండి వస్తుంది, నీటి సమస్య ఏమైనా ఉందా? తాగే నీటిని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారని వార్డెన్ మాధవిని అడుగగా ప్రస్తుతం నీటిసమస్య ఉందని, బోర్ వేయించాలని కోరారు. పంచాయతీ నల్లా వస్తున్నా సరిపోవడం లేదని ఆమె పేర్కొనగా, వెంటనే బోరు వేయించాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో జెడి సురేష్‌రెడ్డి, డిబిసి డబ్ల్యువో కేశవరావు, ఎబిసి డబ్ల్యువో సామెల్, ఏఎస్‌డబ్ల్యువో శే్వత, వార్డెన్ లావణ్య, మాధవి ఉన్నారు.

బిసి హాస్టల్ మూసివేత... రోడ్డునపడ్డ విద్యార్థులు

ఘట్‌కేసర్, జూలై 23: గుట్టు చప్పుడు గాకుండా బిసి హాస్టల్‌ను మూసివేయటంతో విద్యార్థులు రోడ్డున పడ్డ ఘటన ఘట్‌కేసర్ మండలంలో నెలకొంది. ఘట్‌కేసర్ మండల కేంద్రం మైసమ్మగుట్ట కాలనీ వద్ద గత పది సంవత్సరాలుగా నడుస్తున్న బిసి హాస్టల్‌ను కనీస సమాచారం లేకుండా మూసివేయటంతో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఘట్‌కేసర్‌లో ఎస్సీ, బిసి హాస్టళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల బడుగు, బలహీనవర్గాల ప్రజలు తమ పిల్లలను హాస్టల్‌లో చేర్పించి చదివిస్తున్నారు. గత సంవత్సరం 75 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 15 మంది మాత్రమే విద్యార్థులు వచ్చారనే కుంటి సాకుతో హాస్టల్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు రోడ్డున పడి చదువులు మానేసి తమ ఊర్లకు వెళ్లటంతో అసలు విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సంతోష్, మేడ్చల్ డివిజన్ కార్యదర్శి కె శ్రీకాంత్‌రెడ్డి శనివారం వసతిగృహాన్ని సందర్శించారు. హాస్టల్ మూత పడినట్టు తెలియటంతో అధికారులను సంప్రదించగా పొంతన లేని సమాధానం చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థులను ఆదుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతూనే విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. ఉచిత విద్యనందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఉన్న వసతులను తొలగించటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి బిసి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులను నాగారం, శామీర్‌పేట్ హాస్టళ్లకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలిపారు. ఘట్‌కేసర్‌లోని బిసి హాస్టల్‌ను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాలకు తరిలించిన విద్యార్ధులను వెంటనే రప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రాజయ్యను వివరణ అడుగగా పొంతన లేని సమాధానం చెప్పినట్లు ఆరోపించారు. ఘట్‌కేసర్ బిసి హాస్టల్‌ను వెంటనే తెరవకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు, కార్యకర్తలు సందర్శించి పరిశీలించారు.

గొంతు తడపనున్న గోదావరి

మేడ్చల్, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడ్చల్ ప్రజల గొంతులను గోదావరి తడపనుంది. అందుకు సంబంధించిన పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకోగా మిగిలిన పనులను అధికారులు పట్టుదలతో శరవేగంగా నిర్వహించడంలో కాంట్రాక్టర్‌లపై చేస్తున్న వత్తిడి చాలామటుకు ఫలించిందని చెప్పవచ్చు. అక్టోబర్ చివరికల్లా మేడ్చల్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో గోదావరి జలాలను సరఫరా చేస్తామని మిషన్ భగీరథ ఇఇ నరేందర్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గానికి రూ. 160 కోట్లు మిషన్ భగీరథ పథకం కింద మంజూరయ్యాయని తెలిపారు. దీంతో మెయిన్‌గ్రిడ్ పనులు పూర్తి చేశామని వివరించారు. ఈ పథకం కింద మేడ్చల్ నియోజకవర్గంలోని 95 గ్రామాలకు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 9 గ్రామాలకు గోదావరి జలాలను అందించనున్నట్టు పేర్కొన్నారు.
103 గ్రామాలకు అదనంగా రూ. 74.75 లక్షలు మంజూరు కాగా, మేడ్చల్ నగర పంచాయతీకి ప్రత్యేకంగా రూ. 44.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు నెలాఖరుకు పనులు పూర్తిస్థాయిలో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. మేడ్చల్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. మేడ్చల్ పట్టణంలో మాత్రం అధిక జనాభాను దృష్టిలో ఉంచుకుని సంపుల నిర్మాణాలు చేపట్టడంతో అక్టోబర్ నెల వరకు పనులు సాగుతాయని పనులు పూర్తయ్యాక మేడ్చల్ ప్రజల చిరకాల కోరిక అయిన తాగునీటి సమ్యసకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పడనుంది. ప్రత్యేకంగా మేడ్చల్ పట్టణం గత ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో సతమతమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథతో అతిత్వరలో దీనికి తెరపడి శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి సంబంధిత అధికారులు ఎంతో ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపం వెనుక భాగంలో పట్టణ ప్రజలకు గోదావరి జలాలను సరఫరా చేయడానికి 10 లక్షల గ్యాలన్లనీటి సామర్ధ్యం గల సంపును అదేవిధంగా 26 గ్రామాలకు సరఫరా చేయడానికి మరో 10 లక్షల గ్యాలన్‌ల సంపును నిర్మించారు. దాదాపు రెండు సంపు పునులు పూర్తికావచ్చాయి. పట్టణంలోని ఉమానగర్, చంద్రనగర్, రాఘవేంద్రనర్, బాలాజీ నగర్, కెఎల్‌ఆర్ వెంచర్ తదితర కాలనీలకు గోదావరి జలాలను అందించేందుకు రహదారి బంగ్లా ఆవరణలో 10 లక్షల లీటర్ల సామర్ధ్యం గల సంపు, అదేవిధంగా పట్టణంలోని స్టేషన్ రోడ్డులో గల సంపు కూడా 10 లక్షల లీటర్ల సంపు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
వారం రోజుల్లో ఆయా కాలనీల్లో పైపులైన్‌లను ఏర్పాట చేస్తామని తదనంతరం ఇంటింటికి నల్లా కనెక్షన్‌లు ఇచ్చే పైపులను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామాలలో ఆగస్టు నెలలో గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్టోబర్ నెలలో మేడ్చల్ పట్టణంలోని అన్ని కాలనీలకు గోదావరి జలాలు సరఫరా కానున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే పైపులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. బహుశా ఇవ్వాలోరేపో వాటిని ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు కూడా మొదలవుతాయి. మొత్తంమీద మేడ్చల్ ప్రజల పాలిట జటిలంగా మారిన మంచినీటి సమస్య గోదావరి పుణ్యమా అంటూ అతి త్వరలో తీరనుంది. గోదావరి జలాల రాకతో మేడ్చల్ భూగర్భ జలాలు కూడా గణణీయంగా పెరిగే వీలు కలుగుతుంది. గోదావరి జలాలు నిరంతరం సరఫరా చేయనుండంతో బోరుబావుల జోలికి ఎవ్వరు వెళ్లరు దీంతో భూగర్భ జలాలు భారీగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. గోదావరి సకల జనుల్లో ఆనందం నింపేందుకు త్వరలోనే అందరి ఇంటికి చేరనుంది. ప్రస్తుతం పాత మేడ్చల్‌లో పైపులైన్ ఉన్న కాలనీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు పూర్తయ్యాక గోదావరి జలాలను ఆశించిన విధంగా సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గోదావరి జలాలు తరలి వస్తుండటంతో మేడ్చల్ ప్రజల్లో చెప్పలేనంతగా సంబరపడుతున్నారు. ఇదిఇలా ఉంటే గోదావరి జలాలు మేడ్చల్ ప్రాంతానికి పూర్తిస్థాయిలో సరఫరా అయితే స్థిరరాస్తి వ్యాపారం మరింత జోరందుకోవడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. అదే విధంగా ఇంటి అద్దెలు కూడా విపరీతంగా పెరిగి పోతాయని బాధపడిపోతున్న వారు లేనపోలేదు. గోదావరి జలాల రాక అన్ని వర్గాల ప్రజల్లో కొండంత సంతోషాన్ని నింపుతుంది. ఎంత తొందరగా అయితే అంతా తొందరగా మేడ్చల్ ప్రజల గోంతు తడిపేందుకు గోదావరి జలాలు తరలి రావాలని మనము కోరుకుందాం.
రూ. 40లక్షల జరిమానాల వసూలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 23: మహానగరంలో నిబంధనలకు విరుద్దంగా, ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లపై జిహెచ్‌ఎంసి అధికారులు కొద్దిరోజులుగా కఠిన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా కేవలం ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపుయే గాక, 50 మైక్రాన్లకు తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లను వినియోగిస్తున్న వ్యాపార సంస్థలను సైతం గుర్తించి ఇప్పటి వరకు సుమారు రూ. 40లక్షల వరకు జరిమానాలుగా వసూలు చేసినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. దీంతో పాటు నగరంలో బహిరంగంగా చెత్త వేయటాన్ని నిషేధించినా, ఈ నిబంధనను అతిక్రమించిన వారి నుంచి పదిలక్షల 84వేల 303 రూపాయలను వసూలు చేసినట్లు, అలాగే 50 మైక్రాన్లకు తక్కువగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లను వినియోగిస్తున్న వారి నుంచి రూ. 7లక్షల 48వేల 900లను, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టిన వారిని గుర్తించి వారి నుంచి రూ. 20వేల 600, ఫ్లెక్సీలు, బ్యానర్లకు సంబంధించి రూ. 4లక్షల 9వేల 800లను అలాగే బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసిన వారి నుంచి రూ. 2వేల 900 జరిమానాలు విధించినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. దీనికి తోడు ఇప్పటి వరకు సుమారు 4వేల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఒక్కరోజే వీటిని తొలగించామన్నారు.
అదే విధంగా అమీర్‌పేట, మైత్రివనం వద్ధ పలుమార్లు హెచ్చరించినా, కరపత్రాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ రోడ్లపై వేసినందుకు గాను మూడు సంస్థలపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై మున్ముందు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు.