రంగారెడ్డి

గ్రామాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబరు 21: గ్రామాల అభివృద్ధే ధేయంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని మల్కాజ్‌గిరి ఎంపి ఎస్.మల్లారెడ్డి అన్నారు. శనివారంనాడు అహ్మద్‌గూడలో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న స్మశానవాటిక ప్రహరీ నిర్మానానికి మల్లారెడ్డి శంఖుస్దాపన చేసారు.
ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు, పార్టీ కార్యకర్తలు చూడాలని కోరారు. అనంతరం ఆశా వర్కర్లు ఎంపి మల్లారెడ్డిని అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేసారు. కేంద్ర ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఏ ఎం.సుధీర్‌రెడ్డి, సర్పంచ్ నాను నాయక్ జెడ్‌పిటిసి బి.రమాదేవి మండల టిడిపి ఇంచార్జి కె.చంద్రారెడ్డి ఎంపిపి ఆర్.సుజాత, ఎంపిడిఓ వినయ్‌కుమార్ ఎంపిటిసిలు కె.వనితా బాల్‌రెడ్డి కె.శ్రీనివాస్‌గౌడ్ శ్రీహరిగౌడ్ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

బంగారు వైద్య తెలంగాణను ఖచ్చితంగా సాధిస్తాం
నల్లకుంట, నవంబర్ 21: గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్ధితి దయనీయంగా తయారైందని రానున్న కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో వైద్యసేవలు మెరుగుపరచి బంగారు వైద్య తెలంగాణను తప్పక సాధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ధీమావ్యక్తం చేశారు. ఫీవర్‌హాస్పిటల్ (కోరెంటి) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో ఏన్నడు లేనివిధంగా 100 కోట్లు, గాంధీ ఆస్పత్రికి, 100 కోట్ల రూపాయలు ఉస్మానియా ఆస్పత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఇన్‌సెంటివ్ కేర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ తరహా వైద్య సేవలు పేదప్రజలందరికీ అందజేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. డాక్టర్లు, స్ట్ఫాల సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దేశంలోనే ఒక ప్రఖ్యాత ఆస్పత్రిగా ఫీవర్ హాస్పిటల్ గుర్తింపు పొందిందని అభివృద్ధికి కేంద్ర తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. పరిశుభ్రత లేకపోవడంతోనే రోగాలు ప్రబలుతాయని ప్రతి ఒక్కరూ స్వఛ్చ్భారత్ అభియాన్‌లో భాగస్వాములు అవడంతో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని తెలిపారు. తెలంగాణా రాష్ట్రానికి ఎయిమ్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ కల్తీ ఆహారంతో వ్యాధినిరోధక శక్తి ప్రజలలో తగ్గి అంటువ్యాధులు రోజురోజుకు ప్రబలుతున్నాయని ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎండి కోర్సులు ఆస్పత్రిలో ప్రవేశపెట్టల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నారు. కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు హాజరైన కార్యక్రమానికి కలెక్టర్ రాకపోవడం శోఛనీయమని ఇలాంటి కార్యక్రమాలకు కలెక్టర్లు వచ్చినప్పుడే సమస్యలు తెలుస్తామని హితవుపలికారు. అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పుడ్ పాయిజన్ అయినా ఫివర్ ఆస్పత్రికే రోగులను తరలిస్తారని ఒకొక్కప్పుడు వందల సంఖ్యలో వచ్చినా వారికి ఎంతో శ్రద్ధగా వైద్య సదుపాయాలు అందించిన ఘన చరిత్ర ఫీవర్ ఆస్పత్రికి ఉందని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కె.శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, డైరెక్టర్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఛైర్మెన్ డా.ఎం.రమణి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా.బి.ప్రభాకర్, డా.చిత్రలేఖ తదితరులు పాల్గొన్నారు.