రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలకు రూ.లక్ష విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 20: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడు కొత్త గోపాల్ గౌడ్ రూ.లక్ష విరాళం మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేసి తన సేవను చాటుకున్నారు. ఇప్పటికే స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు స్కూల్ అభివృద్ధికి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కొత్త చందర్ గౌడ్, రవి గౌడ్, ఏర్పుల వెంకటేశ్, విక్రం, అజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
వినాయక మండపం నిర్మాణానికి రూ.30వేలు విరాళం
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధి మేడిపల్లిలోని కాకతీయనగర్‌లో వినాయక మండపం నిర్మాణానికి ఏవీ కన్‌స్ట్రక్షన్ ఎండీ, టీఆర్‌ఎస్ నాయకుడు జక్క వెంకట్ రెడ్డి రూ.30వేలు విరాళం అందజేసి భక్తిని చాటుకున్నారు. దయాకర్ రెడ్డి, మనోరంజన్ రెడ్డి, రాంరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ రంజిత్ రెడ్డికి అభినందనలు
బాలాపూర్, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం మైనారీటిల సంక్షేమం కోసం చేపటనున్న వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనల కమిటీలో చెవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సభ్యుడిగా నియమితులైన సందర్భంగా.. మంగళవారం మీర్‌పేట్ టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ, శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్త సిద్ధాల దశరథ అధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ బొబ్బిలి కిరణ్ గౌడ్, దోమలపల్లి కుమార్, శ్రీకాంత్ మర్యాద పూర్వకంగా కలిసి, ఎంపీ రంజిత్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి, అభినందనలు తెలిపారు. దశరథ మాట్లాడుతూ.. ఎంపీ రంజిత్ రెడ్డి మైనారీటీ సంక్షేమ ప్రతిపాదనల కమిటీలో సభ్యులుగా నియమితులు కావడం చాల సంతోషంగా ఉందని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అకాక్షించారు.
ప్లాస్టిక్ నిషేదాన్ని అమలు చేయాలి
మేడ్చల్, ఆగస్టు 20: పర్యావరణానికి ఎనలేని హాని కల్గిస్తున్న ప్లాస్టిక్ నిషేదాన్ని గ్రామంలో సంపూర్ణంగా అమలు చేయాలని అందుకు వ్యాపారులు పూర్తిగా సహకరించాలని గౌడవెల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ కోరారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యలయంలో వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. సర్పంచ్ మాట్లాడుతూ గౌడవెళ్లి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు అంతా కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెంటమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పాతూరి నాగభూషణం జయంతి
మేడ్చల్, ఆగస్టు 20: మేడ్చల్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం దివంగత పాతూరి నాగభూషణం జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ నాగభూషణం పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడిగా చేసిన ఆవిరాళ కృషి మరులేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగేశ్వర్ రావు, గ్రంథాపాలకురాలు యశోద, పలువురు పాఠకులు పాల్గొన్నారు.
బాచుపల్లి రోడ్డుకు మరమ్మతులు
జీడిమెట్ల, ఆగస్టు 20: బాచుపల్లి ప్రధాన చౌరస్తాలో పోలీసులు స్వయంగా మరమ్మతు పనులను చేపట్టారు. వర్షాల కారణంగా గుంతలమయమైన రోడ్లకు బాచుపల్లి పోలీసులు స్వయంగా రెడీ మిక్స్ కాంక్రీట్ మిల్లర్ ద్వారా మరమ్మతు పనులు నిర్వహించారు. పోలీసులు సైతం అనే పదాన్ని బాచుపల్లి పోలీసులు నిరూపించారు. బాచుపల్లి నుంచి బోల్లారం, ఇందిరానగర్, మల్లంపేట్ రోడ్‌లలో ఏర్పడిన గుంతలను రెడీమిక్స్ మిల్లర్ ద్వారా బాచుపల్లి పెట్రోలింగ్ సిబ్బంది దుష్యంత్ రెడ్డి, లింగ్యనాయక్ పూడ్చివేశారు.

పరిశోధనలో మహావీర్ విద్యార్థినికి బహుమతి
వికారాబాద్, ఆగస్టు 20: వికారాబాద్ ఎనె్నపల్లి మహావీర్ ఇనిస్టిట్యూట్‌లో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పావనికి పరిశోధనలో మొదటి బహుమతి లభించింది. సౌదీ అరేబియ ఫోరం 2019 వారిచే నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత మీద ప్రజలకు ఉన్న అవగాహనపై పరిశోధన జరిపి సౌది అరేబియా ఫోరం 2019 వారికి విద్యార్థిని పావని పరిశోధన పత్రం సమర్పించింది. పరిశోధనలో మొదటి బహుమతి సాధించిన పావనిని ఉపాధ్యాయులు అభినందించారు.