రంగారెడ్డి

తృటిలో తప్పిన పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఆగస్టు 20: ఆర్టీసీ బస్సు బ్రేక్‌లు ఒక్కసారిగా పనిచేయకపోవడంతో వేగంగా వెళ్తు చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం షాద్‌నగర్ నుంచి జిల్లేడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయ. జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రం మీదుగా గాలిగూడ గ్రామానికి 40మంది ప్రయాణికులతో వెళ్తున్న షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సుకు ఒక్కసారిగా బ్రేక్‌లు పనిచేయలేదు. దాంతో డ్రైవర్ సమయస్పూర్తిగా వ్యవహరించి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లారు. రోడ్డు విడిచిపెట్టి చెట్ల పొదల్లోకి వెళ్తున్న ఆర్టీసి బస్సును చూసి ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు చేశారు. ఏమి చేయాలో తెలియక కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాల నుంచి, వెనుక భాగం నుంచి కిందకు దూకారు. చెట్ల పొదల్లోకి బస్సును తీసుకువెళ్లి ఆపివేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు బ్రేక్‌లు సక్రమంగా ఉన్నాయా.. లేవా అనే విషయాలను సక్రమంగా గమనించుకోవాలని డ్రైవర్, కండక్టర్‌పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.