రంగారెడ్డి

చెన్నారంలో పంజా విసిరిన చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, ఆగస్టు 21: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయితీ శివారు ప్రాంతంలోని నేదునూరు దశరథం అనే రైతుకు చెందిన ఆవు దూడను మంగళవారం రాత్రి చిరుత వచ్చి చంపివేసిందని బాధిత రైతు తెలిపారు. రైతు దశరథం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మల్లప్పగుట్ట మల్లికార్జునస్వామి దేవాలయానికి కూత వేట దూరంలో ఉన్న దశరథం అనే రైతు పొలంలోని మూడు పశువులు కట్టేసి ఉండగా, అందులో ఒక ఆవు దూడను చిరుత చంపివేసింది. మూడు రోజులుగా రైతు పొలం వద్దనే విద్యుత్ బల్బును ఏర్పాటు చేసుకొని నిద్రిస్తున్నాడు. అర కిలోమీటర్ దూరంలో తలకాయలగుట్ట కొండ ప్రాంతం ఉంది. మూడు రోజులుగా గుట్ట ప్రాంతం నుంచి సాయంత్రం కాగానే చిరుత అరుపుల శబ్ధం వినిపిస్తుందని రైతు తెలిపాడు. మేకల కాపరులు కూడా శబ్ధం వినిపంచిందని తెలిపారు. మంగళవారం రాత్రి విద్యుత్ బల్బు వేసుకొని పొలం వద్దే నిద్రిస్తున్న సమయంలో చిరుత అరుపులు వినిపించడంతో దశరథం భయంతో ఇంటికి వెళ్లాడు. రెండు గంటల సమయంలో తన కుమారుడిని వెంట తీసుకుని పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆవు దూడను చిరుత చంపేసింది. ఆరు నెలల నుంచి ఆమనగల్లు, కడ్తాల్, యాచారం, కందుకూరు, మాడ్గుల మండలాలలోని రైతుల పొలాల్లో ఏదో ఒక చోట చిరుత పంజా విసురుతుంది. మల్లప్పగుట్ట దేవాలయం ఉండటంతో ఇక్కడికి ప్రతినిత్యం వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. రైతులు పొలాల వద్దకు వెల్లలంటే భయం వేస్తుందని పేర్కొంటున్నారు. ఆవు దూడ మృతిచెందిన ప్రాంతాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. చిరుత దాడి విషయంపై ఆమనగల్లు ఫారెస్ట్ అధికారి ఖామాలోద్ధిన్‌ను వివరణ కోరగా చిరుతను పట్టుకోవడానికి బోనును, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తలకొండపల్లి మండల పశువైద్యాధికారి శంకర్, స్థానిక సర్పంచ్ స్వప్న భాస్కర్ రెడ్డి, రెవెన్యూ కార్యదర్శి శ్రీ్ధర్, పంచాయితీ సెక్రెటరీ కల్పన, ఉప సర్పంచ్ వరలక్ష్మీ రామంజనేయులు, ఆమనగల్లు బీట్ ఆఫీసర్ లలిత, సెక్షన్ ఆఫీసర్ దేవేందర్ దాసియా, కడ్తాల్ మండలానికి చెందిన ఫారెస్ట్ స్ట్రైకింగ్ ఫోర్స్ సైదులు, శ్రీశైలం, ప్రశాంత్ పరిశీలించారు.