రంగారెడ్డి

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 21: స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు వివిధ విభాగలకు చెందిన అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంటో వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేందుకు అందరు కృషి చేయాలని సూచించారు. తప్పకుండా పోలీసు అనుమతి తీసుకోవాలని చెప్పారు. సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని పార్కింగ్‌కు కలగకుండా చూడడంతో పాటు భద్రత చర్యలు తీసుకోవాలని వివరించారు. నిమజ్జన చేసే సమయంలో ఈత వచ్చిన వారిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిమజ్జనం చేసే చెరువుల వద్ద ప్రత్యేకంగా క్రెయిన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక శాఖ అధికారులు బోట్లు స్విమ్మర్లను ఏర్పాటు చేస్తున్నారని సీపీ తెలిపారు. కార్యక్రమంలో మేడ్చిల్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి డీఆర్‌ఓ ఉషా, జోనల్ కమిషనర్ దాసరి హరిచందనా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, బాలనగర్ డీసీపీ పద్మజా, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రవీణ్ రావు పాల్గొన్నారు.