రంగారెడ్డి

వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, ఆగస్టు 22: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో అశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది వైద్యాధికారి రవీంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో హరినందన్ రావు ఈర్లపల్లిలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కొడంగల్‌లోని రెడ్డిబసి రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం జరిగే సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరు కానున్నారని, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.
గ్రామాల్లో జోరుగా హరితహారం
మేడ్చల్, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం మేడ్చల్ మండలంలో జోరుగా కొనసాగుతుంది. మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు హరితహారంలో భాగంగా పలు ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు. గురువారం గౌడవెళ్లి గ్రామంలో సర్పంచ్ సురేందర్ వార్డు సభ్యులు ఇంటి యాజమానులతో కలిసి మొక్కలను నాటారు. సర్పంచ్ సురేందర్ మాట్లాడుతూ ఇంటి యాజమానులు మొక్కలను సంరక్షించాలని కోరారు.