రంగారెడ్డి

నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, అగస్టు 24: దేశం గర్వించే విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మాజీ మత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చేవెళ్ల, షాబాద్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఉదయం షాబాద్ మండలంలోని కుమ్మరిగూడలో రూ.66 లక్షలతో బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపీపీ ప్రశాంతి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ అనీతా రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పొన్నమోని కేతన రమేష్ యాదవ్‌తోప్రారంభించారు. చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్‌లో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రారంభించారు. డ్వాక్రా ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారికి రూ.3లక్షలకు రుణాలు అందిస్తామని చెప్పారు. షాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్, అధికారులు హన్మంత్ రెడ్డి, విజయలక్ష్మి, తహశీల్దార్ మదన్‌మోహన్ పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రణాళికతో పారిశుద్ధ్య కార్యక్రమం
ఉప్పల్, ఆగస్టు 24: పీర్జాదిగూడ, బోడుప్పల్ నగర పాలక సంస్థల పరిధిలో అంటువ్యాధులపై యుద్ధం చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కురుస్తున్న చిరు జల్లులు, వాతావరణంలో మార్పులతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దగ్గు, చలి, జ్వరంతో పాటు శ్వాసకోశ వ్యాధులతో పట్టణ ప్రజలు ఆసుపత్రిపాలవుతున్నారు. విజృంభిస్తున్న దోమలు, ఇతర క్రిమీకీటకాలతో అంటు వ్యాధులు ప్రబలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రాణాంతకమైన వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు చేపట్టాలని స్వయంగా సీఎం కేసీఆర్ ఆదేశాల జంట నగర పాలక సంస్థలైన బోడుప్పల్, పీర్జాదిగూడ కమిషనర్లు ప్రణాళికను సిద్ధం చేశారు. రోడ్లలో పేరుకుపోయిన చెత్త చెదారం, మురుగు నీరు లేకుండా చర్యలు చేపట్టి దోమల నివారణకోసం ఫాగింగ్ చేసేందుకు సత్ఫలితాలు వచ్చేలా వార్డుకు ఒక సూపర్‌వైజర్, నలుగురు సూపర్ వైజర్లకు ఒక తనిఖీ అధికారిని నియమించారు. మేడిపల్లి సాయినగర్‌లోని ఖాళీ ప్రదేశంలో 2.5టన్నుల చెత్తను తొలగించినట్లు కమిషనర్ వాణీ రెడ్డి తెలిపారు.