రంగారెడ్డి

టీఆర్‌ఎస్ ఎల్లంపేట్ గ్రామ అధ్యక్షుడిగా సురేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 25: మండలంలోని ఎల్లంపేట్ గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కోరపతి సురేష్ ఎన్నికయ్యారు. ఆదివారం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులుగా గోప సుధాకర్, తుడుం రాజు, ప్రధాన కార్యదర్శిగా నరేంద్ర కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా వెంకని బలరాం, బీసీసెల్ అధ్యక్షుడిగా వడ్ల స్వామి, మహిళా అధ్యక్షురాలిగా మాసని అనురాధలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కూమార్ యాదవ్, సర్పంచ్ వెనె్నల రామకృష్ణుడు ఉపసర్పంచ్ గణేశ్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడలో సమస్యలపై
కాలనీల్లో టీఆర్‌ఎస్ నేతల పర్యటన
ఉప్పల్, ఆగస్టు 25: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని 22వ డివిజన్‌లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలపై టీఆర్‌ఎస్ నేతలు ఆదివారం పర్యటించారు. టీఆర్‌ఎస్ నేత జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు బొందుగుల కృష్ణారెడ్డి, వీకే నాదంగౌడ్, రాంరెడ్డి, జగన్నాథం, మనోరంజన్ రెడ్డి, కపిల్, జంగారెడ్డి, హరినాథ్, యాదవ రెడ్డి, శేరి సవితా కరుణాకర్ రెడ్డి, నిర్మల, నవీన్, సాగర్, నరేందర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ నెలకొన్న సమస్యలను గుర్తించారు. గుంతలు పడిన రోడ్లు, నిలిచిన వర్షపు నీరు, డ్రైనేజీ సమస్యలను సంబధిత అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కరించగలమని ప్రజలకు హామీ ఇచ్చారు.
కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యేలు
శంషాబాద్, ఆగస్టు 25 శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామ సమీపంలో ఉన్న కాళీమాత దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హన్మంతురావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బెంగాళి రాష్ట్రానికి చెందిన గురువులు శంషాబాద్ నగర శివారులో నిర్మించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈలాంటి దేవాలయాలు నిర్మించడంతో గ్రామీణ ప్రాంతాలల్లో భక్తి శ్రద్ధలతో మానసిక ప్రాశాంతత పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు దూడల వెంకటేష్ గౌడ్, టీర్‌ఎస్ నేతలు నీరటిరాజు, దిద్యాల శ్రీనివాస్, సర్పంచ్ ఇస్తారి, మేకల వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.