రంగారెడ్డి

తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఆగస్టు 25: ఆర్టీసీ డ్రైవర్‌కు మూర్చ రావడంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న ఇటుకలను ఢీకొట్టి నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ చార్మినార్ నుంచి కొత్తూరు మండలం జహంగీర్‌పీర్ దర్గాకు వస్తున్న సమయంలో కొత్తూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం చార్మినార్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం అక్కడి నుంచి బయల్దేరి మండల పరిధిలోని పవిత్ర జహంగీర్ పీర్ దర్గాకు వస్తుండగా కొత్తూరు మండల కేంద్రంలోకి రాగానే బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా మూర్చ రావడంతో డ్రైవింగ్ సీట్‌లోనే అలాగే సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. పక్కనే్న ఉన్న ఇటుకల వైపు బస్సును మళ్లీంచడంతో అక్కడే నిలిచిపోయింది. ప్రజలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే కొత్తూరు ముఖ్యకూడలిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
కొత్తూరు రూరల్, ఆగస్టు 25: శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నట్లు కొత్తూరు సీఐ నగరి చంద్రబాబు అన్నారు. ఆదివారం మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడమే కాకుండా నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో పనిచేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం కార్మికులు వస్తున్నారని వివరించారు. పరిశ్రమల్లో పనుల కోసం కార్మికులకు పెట్టుకునే సమయంలో తప్పని సరిగా గుర్తింపు కార్డులు ఉండే విధంగా యజమాన్యాలు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో గుర్తించేందుకు వీలు లేకుండా పోతుందని వివరించారు. నేరస్తులు మాత్రమే గుర్తింపు కార్డులు పెట్టుకొరని, సామాన్య కార్మికులు తప్పని సరిగా పెట్టుకుంటారని, ఈ విషయాన్ని యజమాన్యాలు గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.