రంగారెడ్డి

ఎండిన హరితహారం మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఆగస్టు 25: ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్ధాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుడితే అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అమాడదూరంలో ఉందని చెప్పవచ్చు. కొందుర్గు మండలం ముట్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చుక్కమెట్టు గుట్టపై హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు తీసుకువచ్చి కొన్ని మొక్కలను నాటి మిగతా వాటిని అక్కడే వదలివేయడంతో అవి కాస్తా ఎండిపోయాయి. అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని ప్రజలు అంటున్నారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలు అంటున్నారు. విత్తనాల నుంచి మొక్కగా పెంచేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సరీలను ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి మొక్కలను తెచ్చి ఎండబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం పదేపదే ప్రచారం చేస్తున్నప్పటికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమి పట్టనట్లు వ్యవహరించారే తప్పా ఆచరణలో ఏమాత్రం పాటించడం లేదని అంటున్నారు. హరితహారం మొక్కలు ఎండిపోయే విధంగా వ్యవహరించిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సమాచారం ఇవ్వని ఎపీవో
హరితహారం మొక్కలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కొందుర్గు ఎపీవో నర్సింగ్‌రావును తగిన సమాచారం ఇవ్వలేదు. మండలంలో ఎన్ని నర్సరీలు ఉన్నాయి..ఎన్ని మొక్కలను పంపిణీ చేశారు..నర్సరీల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయానే సమాచారం ఎపీవో నర్సింగ్ రావు వద్ద లేకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పవచ్చు. ముట్పూర్ గ్రామ పంచాయతీ చుక్కమెట్టు గుట్టపై హరితహారం మొక్కలు ఎన్ని నాటారనే విషయంపై అధికారుల వద్దనే స్పష్టమైన సమాచారం లేదని తెలుస్తొంది.