రంగారెడ్డి

30కిలోమీటర్లు.. 75మీటర్ల జాతీయ పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఆగస్టు 8: క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నాగార్జున విద్యాసంస్థల ఆధ్వర్యంలో సోమవారం 75మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో తొమ్మిది పాఠశాలలను కలుపుకొని 30 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. హస్తినాపురం సెంట్రల్ కాలనీలోని నాగార్జున మాంటిస్సోరి, మోడల్ స్కూల్ వద్ద సరూర్‌నగర్ ఎంపిపి తీగల విక్రమ్‌రెడ్డి, క్రైమ్ ఏసిపి రాములునాయక్, విద్యాసంస్థల చైర్మన్ గుమ్మకొండ విఠల్‌రెడ్డిలు భారీ ర్యాలీని ప్రారంభించారు. ఏసిపి రాములు మాట్లాడుతూ విద్యార్థులలో చిన్నతనం నుండే జాతీయ భావాలు పెంపొందించాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో మేథాశక్తి పెరుగుతుందని చెప్పారు. చైర్మెన్ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో కీలకమైందని అన్నారు. నాటి స్పూర్తిని మరోసారి చిన్నారులతో పాటు పెద్దలలో కూడ రగిలించడానికి ఈ యాత్రను చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్‌చైర్మెన్ రజిని విఠల్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ గుమ్మకొండ కార్తీకేయరెడ్డి, ఏఇఓ పి.కృష్ణారెడ్డి, సిఏఓ శేషారావు పాల్గొన్నారు.