రంగారెడ్డి

నూతన టెక్నాలజీ, పరిజ్ఞానానికి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 14: న్యూయార్క్‌కు చెందిన ప్రపంచంలోని అత్యుత్తమ కార్నెల్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం వల్ల వ్యవసాయ విద్యార్థులకు టెక్నాలజీ, పరిజ్ఞానం అధ్యయనం చేసే అవకాశం కలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్‌రావు అన్నారు. ఈ రెండు వర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా పీజేటీ ఎస్ ఏయూలో పీజీ చదువుతున్న నలుగురు విద్యార్థులు, ఒక ప్రొఫెసర్ రెండు వారాల శిక్షణ, అధ్యయనం కోసం న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌ల్లో పీజీ చేస్తున్న ఈ విద్యార్థులు అక్కడ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్‌ల్లో పీజీ చేస్తున్న ఈ విద్యార్థులు అక్కడ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్డ్ రూరల్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో రెండు వారాలు పని చేస్తారు.
తాళ్లకుంట చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 14: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్‌లో కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఈఈ అంజయ్యతో కలిసి డివిజన్‌లోని తాళ్లకుంట చెరువును సందర్శించారు. రానున్న దసరా పండుగ సందర్భంగా నవమి ఉత్సవాల్లో భాగంగా మహిళా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మహిళలు వస్తుంటారని, వెంటనే కుంటలో ఉన్న పదార్థాలను తొలగించాలని వివరించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యురాలు రమాదేవి, బంగి శ్రీను, కొత్తూరు శారదా, ఏఈ ప్రశాంత్ పాల్గొన్నారు.

వినాయక లారీ అసోసియేషన్ ఎన్నికల్లో
మాధవరెడ్డి ఫ్యానల్ ఘన విజయం
ఉప్పల్, సెప్టెంబర్ 14: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని ఉప్పల్ బస్‌డిపో ప్రాంతంలోని వినాయక లారీ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. శనివారం బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో వీ.మాధవ రెడ్డి ఫ్యానల్ మధుసూదన్ రెడ్డి ఫ్యానల్‌పై ఘన విజయం సాధించింది. ఉపాధ్యక్షుడిగా కే.శ్రీను, చైర్మన్‌గా ఏ.రమేశ్ కుమార్ గౌడ్, ప్రధాన క్యాదర్శిగా కే.కరుణాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వీ.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా వీ.బుచ్చి రెడ్డి విజయఢంకా మోగించారు.
పరిగిలో విద్యుత్ కోతతో ఇబ్బందులు
పరిగి, సెప్టెంబర్ 14: రాత్రి పగలు తేడా లేకుండా అప్రకటిత విద్యుత్ కోత వలన పరిగి మున్సిపల్ పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేళాపాళా లేని విద్యుత్ కోతతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే సమ్యస పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.