రంగారెడ్డి

నిబంధనలు పాటించని వారికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, సెప్టెంబర్ 14: హరితహారంలో భాగంగా నిబంధనలు పాటించని సర్పంచుకు, కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఎం.వీ.రెడ్డి జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శామీర్‌పేట గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రమైన శామీర్‌పేటను సందర్శించి హరితహారంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యం మేరకు నాటనందున సర్పంచ్‌కు, కార్యదర్శికి షోకాజ్ నోటీసులు అందజేయాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో కనీస వసతులను ఏర్పాటు చేసుకోవాలని మరుగు దొడ్లను ఏర్పాటు చేసుకోవడం, ఉన్నవాటిని రిపేరు చేయించుకోవడం వంటి పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రంలోని మరుగు దొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని బ్లీచీంగ్ పౌడర్, ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లోని బాహ్యా, అంతర్గత రోడ్లను మరమ్మతు చేయాలని, గ్రామంలో ఐదు స్మశాన వాటికలు 9 ఎకరాల్లో ఉన్నందున వాటిల్లో స్నానపు గదులు, దహనన వాటికలను నిర్మించి వాటిల్లో ఎవెన్యూ ప్లాంటెషన్‌లో పచ్చగా ఏర్పాటు చేయాలని వివరించారు. శామీర్‌పేట గ్రామంలో చిన్న పిల్లల కోసం పార్క్‌ను ఏర్పాటు చేయాలని వాటిల్లో కనీస సదుపాయాల కల్పనకు కృషి చేయాలని తహశీల్దార్ గోవర్థన్‌ను కలెక్టర్ ఆదేశించారు.
స్థానికంగా మినీ స్టేడియం ఉన్నప్పటికీ వాటిల్లో కనీస సదుపాయాలు లేనందున క్రీడాకారుల సౌకర్యార్థం అన్ని క్రీడా వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా యువజన శాఖాధికారి బలరాంను ఆదేశించారు. గుర్తించిన పనులను ఆయా వార్డు సభ్యులు వెంటనే పూర్తి చేయించాలని 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం పూర్తి అయిన తరువాత కూడా సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు తాము ఎంత వరకు పనులు చేశామో పునరాలోలించాలని కలెక్టర్ సూచించారు. సీజినల్ వ్యాదుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానిక ఆరోగ్య కేంద్రంలో మందులు సకాలంలో ఉంచుకొని రోగులను చికిత్సలను అందించాలని అన్నారు. కార్యక్రమంలోడీపీఓ రవికుమార్, సీపీఓ సౌమ్య, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లుబాయి, సర్పంచ్ బాలమణి, ఎంపీడీఓ వాణీ పాల్గొన్నారు.
శామీర్‌పేట బస్టాండులో కనీస వసతులు లేక ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలపడంతో కలెక్టర్ ఎం.వీ.రెడ్డి స్పందించి బస్టాండులోకనీస వసతులను ఏర్పాటు చేసేందుకు అధికారులకు సూచిస్తానని అన్నారు. ఆర్టీసీ బస్టాండులో కనీస వసతులు లేకపోవడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించి సరైన సూచినలను అందిస్తానని చెప్పారు.