రంగారెడ్డి

తహశీల్దార్లకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 14: పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్ , ఇద్దరు తహశీల్దార్లకు నోటీసులు,సర్పంచ్‌లకు షోకాజ్ నోటీసులు. ఇది షాద్‌నగర్ నియోజకవర్గంలో అధికారులు, సర్పంచ్‌ల పరిస్థితి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళన చెందుతున్నారు.
30రోజుల ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక అమల్లో నిర్లక్ష్యం వహించాడని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజును రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ సస్పెండ్ చేశారు. అలాగే మండల పరిధిలోని ఎలికట్ట, నాగులపల్లి గ్రామ సర్పంచ్‌లను ఎందుకు సస్పెండ్ చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ హరీష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా భూముల అమలు కేసులను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కొందుర్గు, కేశంపేట తహశీల్దార్లకు షాద్‌నగర్ ఆర్డీవో కృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
భూముల అమలుకు సంబంధించి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయకపోవడంతో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొందుర్గు మండలంలో 134్భమి అమలు కేసులు, కేశంపేట మండలంలో 216 భూమి అమలు కేసుల ప్రక్రియ పూర్తి చేయకుండా తహశీల్దార్లు పెండింగ్‌లో ఉంచారు. దీంతో ఉన్నతాధికారులు తహశీల్దార్ల నిర్లక్ష్యంపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఉత్తమ పంచాయతీగా గుర్తింపే లక్ష్యం
మేకగూడ గ్రామానికి జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా గుర్తింపుతేవడమే లక్ష్యమని సర్పంచ్ చింతలపల్లి పాండురంగారెడ్డి అన్నారు. శనివారం నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామంలో 30రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టారు.