రంగారెడ్డి

విజృంభిస్తున్న విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 14: విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులతో క్యూ కట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, ఇళ్ళ మద్యలో మురుగునీరు నిల్వ ఉండటం వంటి పరిస్థితుల కారణంగా దోమలు, ఈగలు ఎక్కువగా పెరిగిపోయి అనేక రకాల వ్యాధులకు దారి తీస్తున్నాయని ప్రజలు అంటున్నారు. పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు మంచం పట్టి అవస్థలు పడుతున్నారు. విషజ్వరాలతో ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో తల్లడిల్లుతుంటే పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి తమకేమి పట్టనట్లు వైద్యులు వ్యవహరిస్తున్నారు. విష జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళితే నామమాత్రంగా చికిత్సలు చేసి బయటకు పంపిస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో చికిత్సలు చేయడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. రక్త పరీక్షలు సైతం చేయడం లేదని, బయటకు వెళ్లి రక్తపరీక్షలు చేయించుకు వస్తేనే అందుకు అనుగుణంగా మందులు ఇస్తున్నారే తప్ప లేనిపక్షంలో బయటకు పంపిస్తున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్, టైపాయిడ్ వంటి వ్యాధులతో ఎక్కువగా చిన్నారులే ఆసుపత్రులకు వస్తున్నట్లు తెలుస్తొంది. గత పదిహేను రోజుల నుండి డెంగీ, వైరల్ ఫీవర్ వ్యాధుల బాధితులే ఆసుపత్రికి ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రజలకు వచ్చిన వ్యాధులను నిర్ధారించాలంటే ముందుగా రక్తపరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా చికిత్సలు చేయాల్సి వస్తోందని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి సూపరిండెంటెడ్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, దోమల కారణంగానే ఈ వ్యాధులు వస్తున్నాయని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగీ వ్యాధి వచ్చిన వారిలో ప్లేట్ లెవల్స్ తగ్గితే అవకాశాలు ఉంటాయని, తక్షణమే చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.