రంగారెడ్డి

బాధితులకు న్యాయం చేసేందుకు కృషి : ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 16: ఠాణాకు వచ్చిన బాధితులకు న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఎం.నారాయణ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరుగురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి అసాంఘిక శక్తులనైనా ఎదుర్కొనేందుకు పోలీసుశాఖ ముందుంటుందని తెలిపారు. ప్రజలు కూడా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించి భాగస్వాములు కావాలని సూచించారు.
సమష్టి కృషితో లక్ష్యాలు సాధించుకోవాలి
షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 16: సమష్టి కృషితోనే లక్ష్యాలను సాధించుకోవాలని అయ్యవారిపల్లి సర్పంచ్ లక్ష్మీరమేష్ అన్నారు. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీరమేష్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొవడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తకుండీల్లో వేసే విధంగా కృషి చేయాలని, రోడ్లపై చెత్తవేస్తే వారికి రూ.500 జరిమాన విధించనున్నట్లు పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి గ్రామ పంచాయతీ రిక్షాలు వచ్చిన వెంటనే వారికి ఇవ్వాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఐదు మొక్కల చొప్పున నాటి రక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారిణి భవాని, వీఆర్‌ఓ యాదయ్య, ఉప సర్పంచ్ ఉమాదేవి పాల్గొన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్‌కు ఘన సన్మానం
ఉప్పల్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌ను మున్నూరు కాపు సంఘం మేడిపల్లి కమిటీ ప్రతినిధులు సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు యాదగిరి, వెంకటేశ్వర్లు, సంకూరి మురళి, ఆకుల శ్రీనివాస్, జక్కుల అమరేందర్ సోమవారం సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తుందన్నారు. కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, మున్నూరు కాపు కులస్తులు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.