రంగారెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 16: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అయిశ మస్రత్ ఖానమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో 105 వినతులు వచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, రెవెన్యూ అధికారి మోతీలాల్, డీఆర్‌డీఓ జాన్సన్ ఉన్నారు.
బీసీలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం
జీడిమెట్ల, సెప్టెంబర్ 16: బీసీలకు అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తాలోజు ఆచారి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో చత్రపతి శివాజి సేవా సమితి అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో ఆచారి ఆత్మీయ అభినందన సభ నిర్వహించి దివాకర్ ఘనంగా సన్మానించారు. ఆచారి మాట్లాడుతూ 60 ఏళ్లుగా బీసీలకు న్యాయం చేసిన పార్టీలు లేవని, నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాతే 40 శాతం వరకు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుటుంబ పాలనను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంతారావు, శివరాత్రి దామోదర్, బక్క శంకర్ రెడ్డి, వెంకటేశ్, లక్ష్మీపతి, నారాయణ గౌడ్, ఎల్‌కే ప్రసాద్, సంజు, డీజే, రవికిరణ్ పాల్గొన్నారు.
మహిళల భద్రతకు షీ టీమ్స్ కృషి
జీడిమెట్ల, సెప్టెంబర్ 16: మహిళల భద్రత విషయంలో షీటీమ్స్ ఎంతగానో కృషి చేస్తున్నారని షీటీమ్ ఇన్‌చార్జి అనసూయ అన్నారు. పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గుండ్లపోచం పల్లిలో 15 సంవత్సరాల వయస్సు అమ్మాయికి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఎంగేజ్‌మెంట్ చేసి పెళ్లి చేస్తున్నారనే సమాచారం అందుకున్న సైబరాబాద్ షీటీమ్ ఇన్‌చార్జి డీసీపీ అనసూయ ఆదేశానుసారం పేట్‌బషీరాబాద్ షీటీమ్ బృందం, సీడబ్ల్యూసీ వారితో కలిసి అమ్మాయి పెళ్లి నిలిపివేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనసూయ మాట్లాడుతూ, బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు చేయడంతో భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల భద్రత విషయంలో షీటీమ్స్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. అమ్మాయిలకు ఇబ్బందులు వస్తే 9490617444, 7901114137 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ
కొడంగల్, సెప్టెంబర్ 16: కొడంగల్ మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎన్నిక అయింది. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇరువర్గాలకు జరిగిన ఎన్నికలో హస్నాబాద్ సెక్రటరీ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.కృష్ణవేణి, ఈ.కృష్ణ, జనరల్ సెక్రటరీగా పి.ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ శైలజ, పి.వెంకటచైతన్య, కోశాధికారి కె.మురారీలతో పాటు కమిటీ గౌరవ అధ్యక్షులుగా బుగ్గప్పలతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
కోడెలకు ఘన నివాళి
షాద్‌నగర్, సెప్టెంబర్ 16: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు స్థానిక కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సోమవారం షాద్‌నగర్ కమ్మసేవా సమితి అత్యవసర సమావేశాన్ని అధ్యక్షులు పాతూరి వెంకట్‌రావు ఆధ్వర్యంలో బీవీరావునగర్‌లో కోడెల శివప్రసాద్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ రావుచేసిన సేవలను కొనియాడారు. షాద్‌నగర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను కోడెలకు నివాళి అర్పించారు. ఫరూఖ్‌నగర్ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి విఠ్యాల అంజయ్య, కమ్మసేవా సమితి సభ్యులు పినపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.