రంగారెడ్డి

ప్రతి పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 21: పోచారం పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మంత్రి మల్లారెడ్డి స్వంత ఖర్చులతో రంగులు వేయించటం పట్ల మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అన్నోజిగూడ, రాజీవ్ గృహకల్ప కాలనీలలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం సందర్శించి పరిశీలించారు. రంగులు వేయటం పూర్తి కావటంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా కనపడుతున్నట్లు తెలిపారు. రెండు పాఠశాలలకు మంత్రి మల్లారెడ్డి రెండేసి లక్షల చొప్పున స్వంత నిధులను అందజేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాఠశాలలను దాతల సహకారంతో ఆకర్షణీయంగా మార్చుతామని చెప్పారు.
రోగులతో ఆసుపత్రులు కిటికిట
మహేశ్వరం, సెప్టెంబర్ 21. ఇటీవల ముసురు వర్షాలతో దోమలు బెడద పెరగడంతో పల్లె పట్టణం తేడా లేకుండా జర్వాలు విజృంబిస్తున్నాయి. మహేశ్వరం మండలంతో పాటు పురపాలిక పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ భాధితులు పెరుగుతున్నారు. శనివారం తెల్లవారుఝామున ఎన్‌డీ తండాలో పదోతరగతి చదువుతున్న బాలిక డెంగీతో మృత్యువాత పడటంతో అందరికీ వణుకు పుడుతుంది. వందల మంది పిల్లలు, పెద్దలు అనే తేడా జ్వరాలతో బాధపడుతున్నారు. మహేశ్వరం సీహెచ్‌సీ ఆసుపత్రిలో రోజుకు 150 మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నవారు.వస్తున్నట్లు వైద్యులు ఇంద్రాసేనారెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఆసుపత్రిలో గదులు విశాలంగా లేకపోవడంతో ఇరుకుగా ఉన్న వాటిలోనే రోగులను ఉంచారు. దీంతో ప్రజలు ప్రైవేటు వైద్యానే్న నమ్ముకుంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలల్లోనూ జర్వాల తీవ్రత ఇదే తీరుగా ఉంది 30 రోజుల కార్యచరణలో నిమగ్నమైన అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.