రంగారెడ్డి

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు : సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 21: నేరాల నియంత్రణ, దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. శనివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆర్‌కెనగర్‌లో కాలనీ సంక్షేమ సంఘం ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో కాలనీలో ఏర్పాటు చేసిన 28 సీసీ టీవీ కెమెరాలను సీపీ మహేష్ భగవత్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలు అవగహన కల్పించడంతో ఇటీవల కాలంలో కాలనీ, అపార్ట్‌మెంట్‌లలో నివసించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొవడం వల్ల దొంగతనాలు, గొడవలు, ఎవైనా ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తు చేసేందుకు సులువుగా ఉంటుందన్నారు. అనుమానస్పద వ్యక్తులు వస్తే వెంటనే గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ సందీప్ రావు, సీఐ మన్‌మోహన్ యాదవ్ కాలనీ అధ్యక్ష,కార్యదర్శులు సోమశేఖర్, రవి కిరణ్ పాల్గొన్నారు.
మినీ శిల్పారామంలో
సందర్శకుల సందడి
ఉప్పల్, సెప్టెంబర్ 21: పట్టణంలోని మినీ శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడింది. వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శిల్పారామం సాంస్కృతిక వేదికపై నిర్వహించిన భరత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరర్ రిలేషన్స్ డైరెక్టర్ లక్ష్మాజీరావు ముఖ్య అతిథిగా వచ్చి కళాకారులను అభినందించారు. ఐసీసీఆర్ ఎంపానియెల్డ్ ఆర్టిట్స్ డాక్టర్ దేబాల్లేవ్ జానా చెన్నై తన భరతనాట్య ప్రదర్శనలో భాగంగా జయమహేష జత, జతిస్వరం, శ్రీరామచంద్ర కృపాట భజమన-్భజన్, ధిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. నృత్య దర్పణ డాక్టర్ అర్ధనారీశ్వర వెంకట్ శిశ్య బృందంతో కలిసి అర్ధనారీశ్వరం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. వకళాకారులు డాక్టర్ అర్ధనారీశ్వర వెంకటేశ్ అత్యద్భుతంగా ప్రదర్శించారు.