రంగారెడ్డి

పర్యావరణ పరిరక్షణ-కుమ్మర్ల పాత్రపై సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, సెప్టెంబర్ 21: ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం పర్యావరణ పరిరక్షణ-కుమ్మర్ల పాత్ర అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్‌రావు, నగర కమిటీ అధ్యక్షుడు బండారు భిక్షపతి, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు శ్యాంకుమార్, మట్టి పాత్రల ట్రైనింగ్ కమిటీ అధ్యక్షుడు వేలాద్రి, సంఘం ప్రతినిధులు,రాష్ట్ర బీసీ నేత దొమ్మాట వెంకటేశ్, నరేష్, సిల్వేరు శంకర్, రీసర్చ్ స్కాలర్స్ కృష్ణ, కిషన్ పాల్గొని మట్టి పాత్రల వినియోగంపై వివరించారు. వచ్చిన అతిథులందరికీ మట్టి గ్లాసులలోనే తాగు నీటిని సరఫరా చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి కుండలు, గ్లాసులను వినియోగంలోకి తీసుకరావాలని ప్రభుత్వాన్ని కోరారు.
కొనసాగుతున్న ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో
వనస్థలిపురం, సెప్టెంబర్ 21: తెలంగాణ వీడియో అండ్ ఫొటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో2019 రెండవ రోజు ఘనంగా జరుపుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కేబీఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో 20 నుంచి 23 వరకు ఏర్పాటు చేసిన ఎగ్జీబీషన్‌కు శనివారం చక్కటి స్పందన లభించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫొటో గ్రాఫర్స్ పెద్ద ఎత్తున హాజరై తాము ప్రదిర్శంచిన అనేక రకాల చిత్రాలను ఎక్స్‌పోలో ప్రదర్శించారు. చూపరులు హాజరై వీటిని తిలకిస్తూ, అధునాతన తరహాలో ఏర్పాటు చేసిన పలు రకాల పరికరాలను కోనుగోలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, మధు, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో చక్కటి ఏర్పాట్లను చేశారు.

ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలి

* మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర
షాద్‌నగర్, సెప్టెంబర్ 21: ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పురపాలక సంఘం కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్క్రాప్ షాప్ , ర్యాగ్ పిక్కర్లతో (చెత్త కాగితాలు సేకిరించేవారు) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ శరత్‌చంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘స్వచ్ఛత హీ సేవ’లో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాకడంపై అవగాహన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. అందులో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చట్ట ఉల్లంఘనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తే జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్క్రాప్‌షాపు యజమానులు, ర్యాగ్‌పిక్కర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.