రంగారెడ్డి

నేటి నుంచి ఆర్టీసీ సమ్మె ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 9: ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగలేదు. న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం చేపట్టిన సమ్మె ఐదు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఉప్పల్, చెంగిచర్ల బస్‌డిపోల కార్మికులు గురువారం నుంచి ఆందోళన ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు గురువారం నుంచి నిరసనలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల మద్దతును తీసుకుంటున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు.
న్యాయమైన పద్ధతిలో శాంతి యుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పోలీసు పహారా మధ్య బుధవారం చెంగిచర్ల డిపో నుంచి 44, ఉప్పల్ డిపో నుంచి 58 బస్సులను నడిపించారు. దసరా సెలవుల నేపథ్యంలో అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను సిద్ధం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. బస్సులను నడిపిస్తున్నా ఆశించిన చార్జీలు వసూలు కావడంలేదు. సమ్మె విజయవంతంగా కొనసాగిస్తున్నా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. ప్రధాన మార్గాల్లో యదావిదిగా బస్సులు నడిచాయి.
వీలైనన్ని బస్సులు నడుపుతున్నాం: డీ ఎం రాజశేఖర్
తాండూరు డిపో పరిధిలోని పలు రూట్లలో ప్రయాణీకులకు ఇబ్బందులు
తలెత్తకుండా ఆర్టీసీ అద్దె బస్సులు సహా మరికొన్ని ఆర్టీసీ సోంత బస్సులను
నడిపిస్తున్నట్లు డీపో మేనేజర్ రాజశేఖర్ బుధవారం సాయంత్రం వెల్లడించారు.
దసరా పండుగ వేళ ప్రయాణీకులకు ఇక్కట్లు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు డీఎం తెలిపారు. బుధవారం ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం అయినందున స్థానిక డీఎస్పీ ఎం.రామచంద్రుడు ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ సర్కిల్ సీఐ పోలీస్ సబ్ డివిజన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల నుంచి పోలీస్ బలగాలను రప్పించి భద్రత చర్యలు మరింత కట్టు దిట్టం చేసినట్లు డీఎస్పీ రామచంద్రుడు సాయంత్రం వెల్లడించారు.