రంగారెడ్డి

సమ్మెతో స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 9: డిమాండ్ల సాధనకోసం సమ్మె చేపడుతున్న ఆర్టీసీ కార్మికులతో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆర్టీసీ సంస్థ బస్సులు వరుసగా రోడ్డెక్కకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో మొత్తం 171 బస్సులు ప్రయాణీకులను నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలోని జేబీఎస్, ఇలీబన్, మెడ్చల్, కంటోనె్మంట్, సికిందారాబాద్, దిల్‌సుక్‌నగర్, ఎల్‌బీనగర్, సంతోష్‌నగర్ ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తూ వేలాది మంది ఆర్టీసీలో నిత్యం ప్రయాణం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం ఉద్యోగస్తులు, చదువుల నిమిత్తం విద్యార్థులు, కూలీపనికోసం వెళ్లే దినసరి కూలీలు, కూరగాయలు, పాలు నగరానికి తరలించే రైతులపై సమ్మెభారం అధికంగా పడుతోంది. దసరా సంధర్భంగా సొంతూళ్ళకు వెళ్లిన వారు కూడా ఈ ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఆర్టీసీ యాజమాన్యం తాత్కాళికంగా ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో కొన్ని బస్సులు నడిపిస్తున్నా నిర్వాహణా లోపంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. టికెట్‌లు ఇవ్వకుండా కేవలం చార్జీలను వసూలు చేస్తూ ప్రయాణాలు చేయమనడంతో సమస్య తలెత్తుతోంది. ఏ స్టేజీకి ఎంత చార్జీనో కూడా అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. తాత్కాలిక కండక్టర్లు అడిగిన కాడికి ఇస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అటు ప్రైవేటు వాహనల్లోనూ పరిమితికి మించి ప్రయాణీకులతో గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. దీనికి తోడు అధికంగా చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు ఇబ్రహీంపట్నం డిపోకే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, ఆరుట్ల బస్టాండ్‌లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం ప్రైవేటు వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి. గురు, శుక్రవారం నుంచి కొన్ని విద్యాసంస్థలు ప్రారంభం కానుండడం, ఉద్యోగస్తులు ఖచ్చితంగా తమ ఉద్యోగాలు వెళ్లాల్సి ఉండడంతో సమ్మె ప్రభావం మరింత పెరగనున్నది.
పట్నం డిపోకు రోజుకు రూ. 9లక్షల నష్టం : ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసు
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఇబ్రహీంపట్నం డిపోకు భారీగా నష్టం వాటిల్లుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసు తెలిపారు. బుధవారం ఆంధ్రభూమితో మాట్లాడుతూ నిత్యం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో నుంచి 171 బస్సులు నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తూ ప్రయాణీకులను గమ్యస్తానాలకు చేరుస్తున్నాయని అన్నారు. వీటిలో 127 ఆర్టీసి సంస్థ, 44 ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని అన్నారు. నిత్యం రూ. 9 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సమ్మె కారణంగా రోజుకు రూ.1.5 లక్షలలోపు మేరా మాత్రమే వసూళ్లు అవుతున్నట్లు వివరించారు. సుమారు 40 బస్సులను ప్రయాణీకుల సౌకర్యార్థం తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్నట్లు చెప్పారు. లాభాల బాటలో ఉన్న ఇబ్రహీంపట్నం డిపోకు సమ్మెతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు.
తాండూరులో ఆర్టీసీ సమ్మె ఉధృతం
తాండూరు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నాల్గోవ రోజు తాండూరు ఆర్టీసీ డిపోలో కార్మికులు బుధవారం తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. డిపో ప్రాంగణంలో బైఠాయించిన కార్మికులు అక్కడే వంటావార్పు చేపడుతూ తమ సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు అరకోరగా నడుస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా డిపోలో 80 శాతం బస్సు సర్వీసులు ఎక్కడి కక్కడే నిలిచి ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు స్థానికంగా రాజకీయ నాయకులు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, పార్టీల నాయకులు డిపో ప్రాంగణానికి వెళ్లీ తమ మద్దతును తెలుపుతున్నారు. ఆయా పార్టీల నాయకులతో పాటు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతి నిధులు మాట్లాడుతూ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అవలంభిస్తున్న ఏక పక్ష మొండి వైఖరులను తీవ్రంగా దుయ్య బట్టారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ పాలకులు ఆటలాడు కోవటం సరైన విధానం కాదని పలువురు రాజకీయులు తమ నిరసన ధ్వనులు వ్యక్తం చేశారు.