రంగారెడ్డి

సైబరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 15: దేశంలోనే సైబరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణలో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు అభినందన సభను మంగళవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. 10 నెలల పాటు శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో శౌర్య అకాడమీకి చెందిన ప్యాకల్టీలు, పోలీసు అధికారులు శిక్షణ ఇవ్వగా, 900 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాస్తే 280 మంది ఎంపికయ్యారు. వారిలో 110 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన రెండు కుటుంబాలు నుంచి ముగ్గురు, తొమ్మిది కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘువర్ధన్ రావు సన్మానించారు. అనంతరం వారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన కానిస్టేబుళ్లను ఉద్దేశించి సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ నిజాయితీ క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేసే సంస్థకు సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు మంచి జీతభత్యాలు, గుర్తింపు లభిస్తుందని ఆయన వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు వెళ్లకుండా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు కావాలని అన్నారు. భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు మరవకుండా కంటికి రెప్పలాగా చూసుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో మీ పాత్ర గణనీయమైందని ఆ దిశగా పని చేయాలని సూచించారు. ఉద్యోగం వచ్చిందని చెడు అలవాట్లకు బానిస కావద్దని, భవిష్యత్తులో మరిన్ని అవరోధాలు అధిగమించాలని వివరించారు. రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ ఒక బాధ్యతగా క్రమశిక్షణ నీతి నిజాయతీగా పని చేసినప్పుడే ఆ సంస్థకు మంచి పేరు తెచ్చిన వారు అవుతారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, సౌర్య కోచింగ్ సెంటర్ ఇన్‌చార్జ్ నరేష్ నాయుడు, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్ ఏసీపీలు అశోక చక్రవర్తి, వెంకటేశ్వర్లు, సీఐ సురేష్, సత్తయ్య గౌడ్, వెంకటేశ్వర్లు, లింగయ్య, మహేష్, రవికుమార్ పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల వాడకం నివారణపై శిక్షణ
రాజేంద్రనగర్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఆర్డీ)లో మాదక ద్రవ్యాల డ్రగ్స్ దుర్వినియోగం - నివారణ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణాను టీఎస్‌ఐర్డీలోని, సీడబ్యూసీడీ సెంటర్ హెడ్ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షణా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు హాజరయ్యారు. ఔషధ దుర్వినియోగంతో శారీరక, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారని తెలిపారు.