రంగారెడ్డి

రాత్రికి రాత్రే వెలిసిన అంబేద్కర్ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 20: గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం రాత్రికి రాత్రే రాష్ట్రంలోనే అతి ఎతె్తైన భారతరత్న అంబేద్కర్ విగ్రహం వెలిసింది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ ఏర్పాటు చేశారు. ఈశ్వర్ సర్పంచ్‌గా పదవీలో ఉన్న సమయంలో గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ కార్యాయం ఎదుట ఉన్న అంబేద్కర్, జాతిపిత, ఎన్టీఆర్ విగ్రహాలు పురాతనమైనవని తొలగించారు. అదే స్థానంలో నూతన విగ్రహాలను ఏర్పాటు చేస్తానని గతంలోనే ఈశ్వర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ పదవీ కాలం ముగిసినప్పటికీ శనివారం రాత్రి రాష్ట్రంలోనే అతి ఎతైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 25 అడుగుల ఎతైన అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని క్రేన్ సహాయంతో మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం గమనించిన పట్టణ వాసులు ఆశ్చర్యం చెందారు. భారీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఏలా ఏర్పాటు చేశారని విస్మయం చెందారు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ విగ్రహాల ఏర్పాటు విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ముందస్తుగా ఎటువంటి గొడవలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజాగాయకుడు గద్దర్‌తో పాటు దళిత సంఘాల నాయకులు ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకున్నారు. మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్‌పై గద్ధర్ ప్రశంసలు కురిపించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి..
గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ పేర్కొన్నారు. దళిత సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగంలో దళితులకు హక్కులను కల్పించిన మహానీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కొందరు తనపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని వివరించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, దాగిళ్ల రాజు, బేరీ రాజేశ్, సంతోష్, బేరీ శంకర్, మహేశ్, వెంకటేశ్, సూర్యం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు
గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాత్రికిరాత్రే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మున్సిపల్ అధికారులు పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు ధ్రువీకరించారు. పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేసినవారిని గుర్తించినట్లు వివరించారు.
మాజీ సర్పంచ్ ఈశ్వర్‌పై కేసు
గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు పేట్‌బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ మహేశ్ తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్ వివరించారు.