రంగారెడ్డి

పోలీసు నిఘాలో విధుల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 20: అభద్రత మధ్య తహశీల్దార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ సంఘటనలో విజయా రెడ్డి దారుణ హత్య తరువాత అక్కడక్కడ చోటుచేసుకుంటున్న సంఘటనలు రెవెన్యూ ఉద్యోగుల్లో కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామలో మంగళవారం నుంచి పోలీసు భద్రత కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొందుర్గు తహశీల్దార్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ కొందుర్గు, కేశంపేట, నందిగామ, కొత్తూరు, చౌదరిగూడ మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలు పని చేస్తున్నాయి. రెవెన్యూ అధికారులు రాకముందే పోలీసులు కార్యాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి గస్తీ తిరుతున్నారు. రెవిన్యూ కార్యాలయానికి ఎందుకు వచ్చారనే విషయంపై స్పష్టమైన సమాధానం చెబితేనే కార్యాలయంలోకి అనుమతి ఇస్తున్నారని అంటున్నారు.