రంగారెడ్డి

వికారాబాద్‌లో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 20: వికారాబాద్ అంటేనే విద్యా కేంద్రంగా నాటి నుంచి నేటి వరకు విరాజిల్లుతుందని, అలాంటి విద్యా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమని విద్యాశాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు గ్రంథాలయ చైర్మన్ ఎస్.కొండల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌లో ప్రభుత్వ స్టడీ సర్కిల్ ను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా మెట్టినిల్లు అయితే.. వికారాబాద్ జిల్లా నా పుట్టినిల్లు అని, అన్నివిధాల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ కొండల్ రెడ్డి సొంత డబ్బులతో కోచింగ్ ఏర్పాటు చేసి 120 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేందుకు కారణమవడం ఎంతో అభినందనీయమని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ పీ.సునీతా రెడ్డి మాట్లాడుతూ ఎంత సాంకేతికత పెరిగినా.. పుస్తకానికి గూగుల్ తల్లి సరికాదని ఉద్ఘాటించారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి జడ్పీ నిధులు కేటాయిస్తామని, దాతలు సైతం ముందుకు వచ్చి గ్రంథాలయాలను అభివృద్ధికి సహకరించాలని సూచించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 150 మంది వరకు ఎంబీబీఎస్ సీట్లు సాదించారని గుర్తు చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ, సాతంత్య్రోద్యమ సమయం నుంచి గ్రంథాలయాలు ఉన్నవని, గ్రంథాలయాల ప్రాధాన్యతను ఎంత చెప్పిన తక్కువేనని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఎంత డబ్బులు సంపాదించిన తనకు తృప్తి ఇవ్వలేదని, విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం తో పాటు కోచింగ్ వంటివి ఏర్పాటు చేసి 120 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని అన్నారు. సమావేశంలో గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ ఎ.శ్రీ్ధర్, సినీ డైరెక్టర్ శంకర్, జడ్పీ సీఈఓ శ్రీకాంత్ రెడ్డి, డీఈఓ రేణుకాదేవి ఉన్నారు. అంతకు ముందు సెలబ్రిటీలు బిత్తిరి సత్తి, మంగ్లీ ఆటాపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలుగించారు.