రంగారెడ్డి

ఆర్టీసీ కార్మికుల పట్ల కక్ష సాధింపు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, నవంబర్ 20: ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లాకు వెళ్తున్న సందర్భంగా షాద్‌నగర్ వద్ద బైపాస్ రహదారిపై అపి బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమై డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండివైఖరి అవలంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని కార్మికులు రద్దు చేసుకున్నప్పటికీ మిగతా సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని, సమస్యల సాధన కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రభుత్వానికి అనేక మార్లు చూచించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరుపున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆర్టీసీ వ్యవస్థను రక్షించుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.